టీం ఇండియా ఓటమికి రాహులే కారణం...?

Veldandi Saikiran

భారత జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ శర్మకు అప్పగించిన తర్వాత... వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ను నియమించి.. అతనే కాబోయే భారత కెప్టెన్ అనే హింట్ ఇచ్చేసింది. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ కు రోహిత్ దూరం కావడం వల్ల.. మొదటి టెస్ట్ లో వైస్ కెప్టెన్ గా ఉన్న రాహుల్... రెండో టెస్ట్ కు కోహ్లీ గాయపడటంతో కెప్టెన్ గా జట్టును నడిపించాడు. అయితే ఈ మ్యాచ్ లో టీం ఇండియా ఓడిపోగా.. అది కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్సీ వైఫల్యం వల్లే అని సునీల్ గవాస్కర్ అన్నాడు. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో రాహుల్ ఫీల్డ్ సెటప్ విషయంలో విఫలమయ్యాడని... అతని కెప్టెన్సీ వైఫల్యం... సౌతాఫ్రికా కెప్టెన్ డీన్‌ ఎల్గర్‌ పనిని సులభం చేసిందని అభిప్రాయపడ్డాడు. భారత ఆటగాళ్ల చెత్త ఫీల్డింగ్ కూడా సౌతాఫ్రికా విజయానికి కలిసొచ్చిందన్నాడు.
'విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌గా లేని ఒక టెస్టు మ్యాచ్‌లో భారత్‌ ఓడడం ఇదే తొలిసారి. అయితే ఈ మ్యాచ్ లో రాహుల్ కెప్టెన్సీ వైఫల్యమే... ఎల్గర్‌కు సానుకూల సంకేతాలు ఇచ్చింది. ఎల్గర్‌ బంతిని హుక్‌ చేయడు. కానీ అలాంటి బ్యాట్స్‌మన్‌కు డీప్‌లో ఇద్దరు ఫీల్డర్లను పెట్టడంలో అర్థమే లేదు. ఈ లోపాన్ని ఉపయోగించుకుని డీన్‌ సులభంగా సింగిల్స్‌ తీసుకుంటూ క్రీజులో పాతుకుపోయాడు'' అని గవాస్కర్ వివరించాడు. సౌతాఫ్రికాతో పోలిస్తే ఫీల్డింగ్‌లో భారత్‌ పదును లోపించిందని గవాస్కర్‌ చెప్పుకొచ్చాడు. ఇక హాఫ్ సెంచరీలతో రాణించిన టీమిండియా సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానే సునీల్‌ గవాస్కర్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. అయితే సౌతాఫ్రికా గడ్డపై మూడు దశాబ్దాలుగా ఊరిస్తున్న టెస్ట్ సిరీస్‌ విజయం.. టీమిండియాకు చిక్కినట్లే చిక్కి దూరమైంది. ఇప్పుడు టీం ఇండియా ఈ సిరీస్ కు చేజికించుకోవాలంటే... జనవరి 11 నుండి ప్రారంభం కానున్న ఆఖరి టెస్ట్ లో తప్పకుండ గెలవాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: