ఓరినాయనో.. ఇదేం ఫీల్డింగ్.. ఓకే బంతి 7 పరుగులు?

praveen
సాధారణంగా ఫీల్డింగ్ చేస్తున్న జట్టు ప్రత్యర్థులకు ఒక్క రన్ కూడా ఎక్స్ట్రాలు ఇవ్వడానికి అస్సలు ఇష్టపడరు. కానీ కొన్నిసార్లు అనుకోని విధంగా ఫీలింగ్ వైఫల్యం కారణంగా బ్యాటింగ్ చేస్తున్న జట్టుకు భారీగా పరుగులు సమర్పించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక అప్పుడప్పుడు క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగిపోతున్న సమయంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది.  ప్రస్తుతం బంగ్లాదేశ్ జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టెస్ట్ సిరీస్ ఆడుతుంది.

 ఇక ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా ఇటీవలే రెండో టెస్టులో ఒక విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఏకంగా ఒకే బంతికి 7 పరుగులు సమర్పించుకున్నారు బంగ్లాదేశ్ ఫీల్డర్లు. ఫీల్డింగ్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది అని చెప్పాలి. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో భాగంగా 26 ఓవర్లు ఈ ఘటన చోటుచేసుకుంది. 26 ఓవర్ వేసిన బంగ్లాదేశ్ బౌలర్ ఎబాడాట్ హుస్సేన్ బౌలింగ్ లో ఆఖరి బంతిని విలియం డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే  బంతి ఎడ్జ్ తీసుకుంది. కాగా స్లిప్ లో ఉన్న ఫీల్డర్  లిటన్ దాస్ దగ్గరికి వెళ్ళింది. కానీ అతడు మాత్రం ఫీలింగ్ వైఫల్యం కారణంగా క్యాచ్ వదిలేశాడు. ఇక వెంటనే ఆ బంతి థర్డ్ మ్యాన్ వైపు దూసుకుపోయింది. ఇంతలో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ లు 3 పరుగులు రాబట్టారు.

 ఇక అంతటితో ఆగకుండా ఫీల్డర్ బౌలర్ వైపు బంతిని త్రో చేయగా బౌలర్ బంతిని ఆపడంలో విఫలమయ్యాడు. చివరికి ఫోర్ బార్డర్ వరకు దూసుకెళ్లింది. దీంతో ఓవర్ త్రో రూపంలో మరో నాలుగు పరుగులు కూడా న్యూజిలాండ్ జట్టుకు కలిసివచ్చింది.  అంతా చూస్తూనే ఉన్న ఫీల్డ్ అంపైర్ ఆ తర్వాత ఏకంగా ఒక బంతికి 7 పరుగులు ఇచ్చేశాడు. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇది చూసిన తర్వాత వామ్మో ఇలాంటి ఫీల్డింగ్   ఏంటి గురు.. మీరు ఏమైనా గల్లీ క్రికెట్ ఆడుతున్నారు అని అనుకుంటున్నారా అంటూ ఎంతోమంది కామెంట్ లు పెడుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: