పాక్ మాజీ కెప్టెన్ నాకు లంచం ఆఫర్ చేశాడు : షేన్ వార్న్

praveen
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ గుర్తింపు ఉన్న ఆటలలో అటు క్రికెట్ కూడా ఒకటి అనే విషయం తెలిసిందే. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు ప్రేక్షకులు అందరూ టీవీలకు అతుక్కుపోయి మ్యాచ్ వీక్షిస్తూ ఉంటారు. ఉత్కంఠభరితంగా సాగే మ్యాచ్ లాల్ అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పొందుతూ ఉంటారు ప్రేక్షకులు. అయితే ఇటీవలి కాలంలో క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ లాంటివి వెలుగులోకి రావడం లేదు. కానీ అప్పట్లో మాత్రం ఇలా తరచుగా మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి ఘటనలు వెలుగులోకి వస్తూ సంచలనంగా మారిపోతూ ఉండేవి. ఈ క్రమంలోనే గతంలో ఎంతో మంది క్రికెటర్లు మ్యాచ్ ఫిక్సింగ్ లాంటివి పాల్పడి నిషేధానికి గురైనఘటనలు కూడా అందరికీ తెలిసిందే.

అంతేకాదు ఉత్కంఠభరితంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో ప్రత్యర్థి జట్టు బలంగా ఉంది అనిపిస్తే.. ఇక ఆటగాళ్లను భారీగా డబ్బు డిమాండ్ చేసి మంచి ప్రదర్శన చేయకుండా చేయడం లాంటివి కూడా చేసేవారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో దిగ్గజ క్రికెటర్ గా కొనసాగుతున్న షేన్ వార్న్ తనకు ఒకానొక సందర్భంలో ఎదురైన అనుభవాలను ఇటీవల మీడియాతో పంచుకోవడంతో చాలా హాట్ టాపిక్గా మారిపోయింది. ఆస్ట్రేలియా క్రికెట్ లో  తన స్పిన్ మాయాజాలంతో షేన్వార్న్ ఎన్నో అద్భుతాలు సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ క్రికెట్లో ఆస్ట్రేలియా నెంబర్ వన్ స్థానంలో ఉండటానికి షేన్ వార్న్ కూడా కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే 1994లో పాకిస్థాన్ పర్యటనలో భాగంగా తనకు ఎదురైన ఒక అనుభవం ఇటీవల చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన సందర్భంలో అప్పుడు పాకిస్తాన్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు సలీం మాలిక్. అతను నేరుగా నా దగ్గరికి వచ్చి డబ్బులు ఇస్తాను మెరుగైన ప్రదర్శన చేయవద్దు అంటూ  లంచం ఇచ్చేందుకు ప్రయత్నించాడు అంటూ షేన్వార్న్ చెప్పుకొచ్చాడు. సామర్థ్యం మేరకు ప్రదర్శన చేయకూడదు అంటూ తనతోపాటు మరో ఆటగాడు టీమ్ మే కి కూడా లంచం ఇచ్చేందుకు ప్రయత్నించాడు అంటూ గుర్తుచేసుకున్నాడు షేన్వార్న్. కాగా షేన్ వార్న్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన డాక్యుమెంటరీ త్వరలో అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే ఇటీవల మీడియాతో మాట్లాడిన షేన్ వార్న్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: