నేను తప్పు చేసాను.. హర్షల్ పటేల్ షాకింగ్ కామెంట్స్?

praveen
ఇటీవలి కాలంలో ఐపీఎల్లో ఎంతో మంది యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తూ సత్తా చాటుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత ఏడాది ఐపీఎల్ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో స్థానం దక్కించుకున్న యువ బౌలర్ హర్షం పటేల్ ఎంత అద్భుతంగా రాణించాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐపీఎల్ సీజన్ లో 32 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ విజేతగా నిలిచాడు హర్షల్ పటేల్. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి. అయితే ఇలా బెంగళూరు జట్టు లో అద్భుతంగా రాణించిన హర్షల్ పటేల్ జట్టు యాజమాన్యం రిటైన్ చేసుకుంటుంది అని అందరు అనుకున్నారు. కానీ ఊహించని విధంగా అతన్ని వేలం లో కి వదిలేసింది జట్టు.

 కేవలం విరాట్ కోహ్లీ,మ్యాక్స్వెల్,  సిరాజ్ లను మాత్రమే రిటైన్ చేసుకుంది. అయితే రిటైన్ చేసుకోకపోవడానికి గల కారణాలు ఏంటి అన్న విషయంపై ఇటీవల యువ ఆటగాడు హర్షల్ పటేల్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆర్ సి బి రిటెన్షన్ లో తన పేరు ఉండదని తనకు ముందే తెలుసు అంటూ వెల్లడించాడు. రిటైన్ చేసుకోవడం లేదు అన్న విషయాన్ని డైరెక్టర్ మైక్ హుస్సేన్ ముందే ఫోన్ చేసి చెప్పారని పర్స్ మేనేజ్మెంట్ కోసం తనను రిటైన్ చేసుకోవడం లేదు అంటూ వివరించారు పటేల్ తెలిపాడు. ఇక మెగా వేలంలో ఆర్సిబి తనను కొనుగోలు చేస్తుంది అన్న నమ్మకం మాత్రం ఉంది అంటూ ధీమా వ్యక్తం చేశాడు.

 ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి ఆర్సిబి ట్రేడ్ చేసుకోవడానికి ఎంతగానో ఆలోచించారని హర్షల్ పటేల్ అన్నాడు.  అయితే నేను డెత్ ఓవర్ స్పెషలిస్టుగా మారతారని ఆర్సిబి జట్టు యాజమాన్యం నమ్మకం పెట్టుకుంది. అయితే వచ్చే వేలంలో లో ఏం జరుగుతుంది అన్నది మాత్రం చెప్పడం కష్టం అంటూ హర్షల్ పటేల్ తెలిపాడు. 2021 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో నా ఓవర్లో రవీంద్ర జడేజా 37 పరుగులు చేయడాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను అంటూ హర్షల్ పటేల్ అన్నాడు.. రెండు బంతులు వేసి అనవసర ఒత్తిడికి లోనయ్యాను అని అప్పటికేజడేజా ఫుల్ ఫామ్లో ఉన్నాడని తాను ఒక్క యార్కర్ కూడా వేయలేక పోవడం దురదృష్టకరం పటేల్ చెప్పుకొచ్చాడు. ఇదే తన కెరీర్లో ఇప్పటి వరకు చేసిన పెద్ద తప్పు అంటూ తెలిపాడు. ఇది కూడా ఒక అనుభవాన్ని ఇచ్చింది అంటూ హర్షల్ పటేల్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: