ఐసీసీ కొత్త రూల్స్.. బౌలింగ్ టీమ్ జాగ్రత్త పడకపోతే కష్టమే?

praveen
ఒకప్పుడు క్రికెట్ మ్యాచ్ లకి ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ లకు ఎంతో తేడా ఉంది అని చెప్పాలి. ఒకప్పుడు సరైన ప్రసారసాధనాలు లేకుండానే క్రికెట్ మ్యాచ్లు జరిగేవి. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి క్రికెట్ మ్యాచ్ను కూడా కూడా ఎలాంటి అంతరాయం లేకుండా టీవీలో వీక్షించగలుగుతున్నాం. అంతేకాకుండా క్రికెట్ లో ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెడుతూ క్రికెట్ మ్యాచ్లో తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఎంతో కచ్చితత్వంతో తీసుకునే విధంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇప్పటికే ఎన్నో రకాల కొత్త రూల్స్ ను తీసుకు వచ్చింది అనే విషయం తెలిసిందే.

 అంతేకాకుండా ఎప్పటికప్పుడు క్రికెట్ మరింత మెరుగు పడే విధంగా ఎన్నో కొత్త రూల్స్ తీసుకువస్తూ ఉంది. ఇక ఇప్పుడు కూడా మరోసారి ఐసీసీ టీ20 లలో కొత్త నిబంధనలు ప్రవేశ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నెల 16న వెస్టిండీస్ ఐర్లాండ్ మధ్య జరిగే టి20 మ్యాచ్ నుంచి ఐసిసి ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలు అమలులోకి రాబోతున్నాయి.  ఐసీసీ తీసుకువచ్చిన ఈ కొత్త రూల్స్ లో స్లో ఓవర్ రేట్ నిబంధన అయితే ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. మొన్నటి వరకు మ్యాచ్ జరుగుతున్న సమయంలో నిర్ణీత ఓవర్లలో ఫీల్డింగ్ చేస్తున్న జట్టు అటు ఓవర్లను పూర్తి చేయకపోతే ఇక మ్యాచ్ ఫీజులో కోత విదిస్తూ నిర్ణయం తీసుకునేది ఐసీసీ. కానీ ఇప్పుడు మాత్రం ఒకవేళ మ్యాచ్లో నిర్ణీత సమయంలో ఓవర్ల కోటని పూర్తి చేయకపోతే ఫీల్డింగ్  చేసే జట్టులో ఒక సభ్యుడిని తగ్గించనున్నారు.

 మైదానంలో 30 గజాల సర్కిల్ బయట ఉండే ఫీల్డర్లు ఒకరిని తగ్గించాల్సి ఉంటుంది అంటూ ఇటీవలే ఐసీసీ తెలిపింది. దీంతో స్లో ఓవర్ రేట్ కి ఇలాంటి విచిత్రమైన పనిష్మెంట్ ఏంటి అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. అంతేకాకుండా అచ్చం ఐపీఎల్ తరహాలోనే ప్రతి ఇన్నింగ్స్కు మధ్యలో ఆపి  డ్రింక్ బ్రేక్ తీసుకోవచ్చు అని తెలిపింది. ఈ బ్రేక్ రెండున్నర నిమిషాల పాటు ఉండవచ్చు అంటూ ఐసీసీ స్పష్టం చేసింది. అయితే ద్వైపాక్షిక సిరీస్లో ఈ నిబంధన ఉండాలంటే రెండు జట్లు సిరీస్ ప్రారంభానికి ముందు దీనికి అంగీకరించి ఉండాలి అంటూ ఐసీసీ స్పష్టం చేసింది.  బంతిలో 50శాతం బెయిల్కు తగిలినప్పుడు దాన్ని ఎల్బిడబ్ల్యు గా పరిగణించాలని ఐసీసీ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: