7 వికెట్లతో సఫారీల నడ్డి విరిచిన శార్దూల్ ఠాకూర్...
అయితే ఈ రోజులో తన దైన బౌలింగ్ మాయతో సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లను ఒక ఆట ఆదుకున్నాడు ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్. శార్దూల్ ఠాకూర్ కు ఒక నైపుణ్యం ఉంది. ఏ ఫార్మాట్ అయినా ప్రత్యర్థి ఎవరయినా మంచి భాగస్వామ్యాన్ని విడగొట్టడంలో దిట్ట. ఈ రోజు కూడా సరిగ్గా అదే జరిగింది. రెండవ వికెట్ తీయడానికి రాహుల్ అందరి బౌలర్లను ప్రయోగించాడు. కానీ శార్దూల్ మాత్రం తాను వేసిన రెండవ ఓవర్ లోనే కెప్టెన్ ఎల్గర్ ను పడగొట్టాడు. ఇక అక్కడ నుండి వరుసగా పీటర్సన్, వండర్ డస్సెన్, బావుమా, వెరెన్నీ, ఎంగిడి మరియు జాన్సన్ లను పడగొట్టి తన టెస్ట్ చరిత్రలో తొలిసారి ఫైవ్ వికెట్ హాల్ తో సహా మొత్తం ఏడు వికెట్లు సాధించి తన ఎంపిక వృధా కాలేదని విమర్శకులకు సరైన సమాధానం చెప్పాడు.
అలా సౌత్ ఆఫ్రికా 229 పరుగులకు చేతులెత్తేసింది. ప్రస్తుతం ఇండియా 27 మొదటి ఇన్నింగ్స్ లోటుతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి జోరుగా ముందుకు వెళుతోంది. మనము ముందుగా అనుకున్నట్లుగా కనీసం 350 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించాలి. అప్పుడే సౌత్ ఆఫ్రికా పై ఒత్తిడి తీసుకు వచ్చి గెలుపు సాధించేందుకు ఆస్కారం ఉంటుంది.మరి చూద్దాం ఏమి జరగనుందో.