ప్చ్.. కోహ్లీకి షాకిచ్చిన ఐసీసీ?

praveen
ప్రస్తుతం టీమిండియా సౌతాఫ్రికా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే  సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ఆడుతుంది   అయితే ఇక ఈ సారి సౌత్ ఆఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవడమె లక్ష్యంగా టీమిండియా ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం టీమిండియా జట్టు బ్యాటింగ్ లో అటు బౌలింగ్ లో కూడా ఎంతో పటిష్టంగానే కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇక సౌత్ ఆఫ్రికా గడ్డపై మొదటిసారి టెస్ట్ సిరీస్ విజయం సాధించి టీమ్ ఇండియా చరిత్ర సృష్టిస్తుందని ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.


 ఇకపోతే ఇటీవలే సెంచరియన్ వేదికగా సౌతాఫ్రికా భారత్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. మొదటి టెస్ట్ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ నుంచి కూడా అటు టీమిండియా అద్భుతంగా రాణించింది అనే చెప్పాలి. ఆతిద్య సౌత్ఆఫ్రికా జట్టుకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా భారీగా పరుగులు చేస్తూ దూసుకుపోయింది. ఈ క్రమంలోనే ఇక రెండు ఇన్నింగ్స్ లో కూడా భారీగా పరుగులు చేసింది. మొదటి టెస్టు మ్యాచ్లో విజయం సాధించింది టీమిండియా. 113 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడంతో భారత్ అభిమానులు అందరూ ఎంతగానో మురిసిపోయారు.



 అయితే సెంచరియన్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియాకు అటు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మాత్రం షాక్ ఇచ్చింది అని చెప్పాలి. కారణం మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమ్ ఇండియా స్లో ఓవర్ రేట్ నమోదు చేయడం గమనార్హం. ఈ క్రమంలోనే స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియా జట్టుకు 20 శాతం జరిమానా విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా వరల్డ్ కప్ చాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో కూడా ఒక పాయింట్ కోత విధిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. మొదటి మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ లో కూడా నిర్ణీత సమయంలో బౌలింగ్ పూర్తి చేయకపోవడంతో ఐసీసీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మొదటి టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించినప్పటికీ కోహ్లీ సేనకు  మాత్రం షాక్ తగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: