పాపం.. క్రిస్ గేల్ కి షాకిచ్చిన బోర్డు?

praveen
ప్రపంచ క్రికెట్లో వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా టి20 ఫార్మాట్ కు క్రిస్ గేల్ పెట్టింది పేరు అనే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి క్రికెట్ మైదానంలో కుదురుకున్నాడు అంటే విధ్వంసకర బ్యాటింగ్ తో స్కోర్ బోర్డు ని పరుగులు పెట్టిస్తు ఉంటాడు. టి-20 ఫార్మెట్లోనూ క్రిస్గేల్ సృష్టించిన విధ్వంసాలు క్రికెట్ ప్రేక్షకుడు మరచిపోలేడు అని చెప్పాలి. అందుకే క్రిస్ గేల్ ను యూనివర్సల్ బాస్ అని కూడా పిలుచుకుంటారు ఎంతో మంది ప్రేక్షకులు.  సాధారణంగా 40 ఏళ్ళ వయసు వచ్చిందంటే చాలు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఉంటారు ఆటగాళ్లు.  కానీ క్రిస్ గేల్ మాత్రం 40 ఏళ్లు దాటి పోతున్నాప్పటికి ఇంకా యువ ఆటగాళ్లకు పోటీ ఇస్తూనే ఉన్నాడు.



 ఇప్పటికే టెస్టులు వన్డేలకు  రిటైర్మెంట్ ప్రకటించిన క్రిస్ గేల్ అటు టీ20 లో మాత్రం కొనసాగుతూ ఉన్నాడు. అయితే టి20 ఫార్మాట్లో ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు క్రిస్గేల్. ఈ క్రమంలోనే క్రిస్ గేల్ రిటైర్మెంట్ ప్రకటిస్తే బాగుంటుంది అంటూ విమర్శలు కూడా వచ్చాయి.. ఇకపోతే ఇటీవలే క్రిస్ గేల్ రిటైర్మెంట్ ప్రకటించ పోతున్నాడు అన్న వార్తలు కూడా వైరల్ గా మారిపోయాయి. టి20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించడంపై గతంలో క్రిస్ గేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సొంతగడ్డపైనే టి20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించాలని అనుకుంటున్నాను అంటూ క్రిస్ గేల్ చెప్పుకొచ్చాడు.



 అయితే టి20 లకు రిటైర్మెంట్ ప్రకటించి మనసులో మాట బయటపెట్టిన క్రిస్ గేల్ కి అటు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మాత్రం ఊహించని షాక్ ఇచ్చింది.   దిగ్గజ క్రికెటర్ అయినా క్రిస్ గేల్ కోరికను అటు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మాత్రం లైట్ తీసుకుంది అని చెప్పాలి. ఎందుకంటే త్వరలో ఐర్లాండ్ ఇంగ్లాండ్ లతో వెస్టిండీస్ జట్టు సొంతగడ్డపై టి20 సిరీస్ ఆడబోతుంది. ఈ క్రమంలోనే ఎంపిక చేసిన జట్టులో అటు క్రిస్ గేల్  చోటు కల్పించలేదు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు. దీంతో సొంత గడ్డపై టి20 లకు రిటైర్మెంట్ ప్రకటించాలన్న క్రిస్ గేల్ కోరిక ఇప్పట్లో పోయేలా కనిపించడం లేదు. ఇక వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఇలా చేయడంతో ఫాన్స్ అందరు షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: