షాకింగ్ : మొదటి మ్యాచ్ రద్దు?

praveen
చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ప్రపంచం మొత్తం పాకిపోవడంతో క్రీడా రంగం ఎంతలా సంక్షోభంలో కూరుకుపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుసగా మ్యాచ్ లతో ఎప్పుడు బిజీ బిజీగా ఉండే ఆటగాళ్లు కొన్ని నెలల పాటు ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఆ తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పులు రాకపోవడంతో ఆటగాళ్లు అందర్నీ కూడా కఠిన నిబంధనల మధ్య ఉంచుతూ.. క్రీడలు యధావిధిగా నిర్వహించాలని అందరూ భావించారు.  ఈ క్రమంలోనే ప్రస్తుతం అన్ని రకాల క్రీడలు కూడా కఠిన నిబంధనల మధ్య జరుగుతున్నాయ్ అన్న విషయం తెలిసిందే.


 ఇక ప్రస్తుతం క్రికెట్ మ్యాచ్ లు కూడా ఇలా బయో బబుల్ పద్ధతిలో ఆటగాళ్లను ఒక హోటల్ కి పరిమితం చేసి మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. ఇంకా ఎన్నో రోజుల నుంచి క్రికెట్ ఆటగాళ్లు బయో బబుల్ కే పరిమితం కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇకపోతే మొన్నటి వరకూ ప్రేక్షకులను స్టేడియానికి అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకోగా మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాయి ఆయా దేశాల క్రికెట్ బోర్డులు. అదే సమయంలో ఎంత కఠినం ఆంక్షల మధ్య మ్యాచ్ లు నిర్వహిస్తున్నప్పటికీ కరోనా వైరస్ మాత్రం షాక్ ఇస్తోంది. సిబ్బంది, ఆటగాళ్లలో కరోనా వైరస్ కేసులు వెలుగులోకి వస్తుండడంతో చివరికి మ్యాచ్ లు రద్దు కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. యుఎస్ఏ- ఐర్లాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది. అయితే ఈ రోజే మొదటి మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ కారణంగా చివరికి మ్యాచ్ రద్దు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆటగాళ్లతో పాటు సిబ్బందిని కూడా బయో బబుల్ లో కఠిన నిబంధనల మధ్య క్వారంటైన్ లో ఉంచారు. ఇటీవలే అంపైర్ల లో ఒకరికి కరోనా వైరస్ రావడంతో  మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ప్రకటించాయి. ఇక 28, 30 తేదీలలో జరగాల్సిన మిగతా రెండు వన్డే మ్యాచ్ లు యధావిధిగా జరుగుతాయని క్రికెట్ ప్రేక్షకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ యూఎస్ఏ  క్రికెట్ బోర్డు తెలిపింది. అయితే మొదటి మ్యాచ్ కోసం టిక్కెట్ కొనుగోలు చేసిన  ప్రేక్షకులు అదే టిక్కెట్లపై తర్వాత మ్యాచ్ చూడవచ్చు అని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: