శ్రీలంక ఆటగాడిపై ఐపీఎల్ కోచ్ ల కన్ను?

VAMSI
ఇండియాలో ప్రతి ఏటా నిర్వహించే ఐపీఎల్ గురించి అందరికీ తెలిసిందే. సాధారణంగా ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఈ లీగ్ ప్రారంభం అయ్యి మే లో ముగుస్తుంది. అంటే దాదాపుగా 50 రోజుల పాటు క్రికెట్ ప్రేమికులకు మాములు మజా కాదు. అయితే కరోనా కారణంగా ఈ సంవత్సరం వేరే వేరే షెడ్యూల్ లో ఎట్టకేలకు పూర్తి అయింది. ఇప్పటి వరకు ఐపీఎల్ 14 సీజన్ లను ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఐపీఎల్ 15 సీజన్ కోసం బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. ఈ సారి మొత్తం 10 జట్లు ఐపీఎల్ టైటిల్ కోసం పోరాడనున్నాయి. ఈ మధ్యనే ఫ్రాంచైజీల రీటెన్షన్ ప్రక్రియ ముగిసింది. దీనితో ఆటగాళ్లు అందరూ వేలంలోకి వచ్చేశారు.

ఈ మెగా వేలం జనవరి ఆఖరు లేదా ఫిబ్రవరి లో జరగనుంది. దీని కోసం ఫ్రాంచైజీ కోచ్ లు అంతా దేశవాళీ స్థాయిలో జరుగుతున్న అన్ని లీగ్ లను చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఇప్పటికే కొందరు ఆటగాళ్లను తీసుకోవడానికి ప్రణాళికలు రచించారు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం శ్రీలంకకు చెందిన మాజీ ఆటగాడు తిసారా పెరీరా పై కోచ్ లు గురి పెట్టారని తెలుస్తోంది. నిన్నటితో ముగిసిన లంక ప్రీమియర్ లీగ్ లో జఫ్నా కింగ్స్ జట్టు టైటిల్ ను అందుకుంది. ఈ జట్టును ఎంతో సక్సెస్ఫుల్ గా ముందుండి నడిపించాడు తీసారా పెరీరా.  

ఈ లీగ్ లో తీసారా పెరీరా ఆకాశమే హద్దుగా చెలరేగి భారీ సిక్సర్ లు కొట్టిన తీరు కోచ్ లను ఎంతగానో ఆకర్శించింది. పైగా పెరీరా బౌలింగ్ కూడా చేయగలడు. అందుకే ఈ సారి వేలంలో తీసారా పెరీరా కు మంచి ధర పలికే అవకాశం ఉంది. అయితే ఈ వార్తలో ఎంత నిజముంది అనేది తెలియాలంటే ఫిబ్రవరి వరకు ఆగాల్సిందే

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: