సౌతాఫ్రికా టూర్.. అతనికి పెద్ద పరీక్షే?

praveen
ఇటీవలే టెస్ట్ ఫార్మాట్ లోకి అడుగుపెట్టిన టీమిండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ తన ప్రతిభతో ఎంత ఆకట్టుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అరంగేట్ర టెస్ట్ మ్యాచ్లో  సెంచరీతో చెలరేగిన పోయాడు శ్రేయస్ అయ్యర్. ఇక ఆ తర్వాత జరిగిన మ్యాచ్ లలో కూడా అద్భుతంగా రాణించి టీమిండియా విజయాన్ని అందించడంలో కీలక పాత్ర వహించాడు అనే చెప్పాలి. అయితే అదే సమయంలో టీమిండియా జట్టులో ఉన్న అజింక్యా రహానే చటేశ్వర్ పుజారా విఫలమైన నేపథ్యంలో ఆటతీరుతో సెలెక్టర్లను ఆకట్టుకున్న శ్రేయస్ అయ్యర్ సౌత్ఆఫ్రికా టూర్ కి ఎంపికయ్యాడు



 ఇకపోతే దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా ఇప్పటికే టీమ్ ఇండియా జట్టు సౌత్ ఆఫ్రికా గడ్డపై అడుగుపెట్టగా.. డిసెంబర్ 26వ తేదీ నుంచి సౌత్ ఆఫ్రికా జట్టుతో మూడు టెస్టుల సిరీస్ ఆడబోతుంది టీమిండియా.  ఈ సందర్భంగా మాట్లాడిన బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శ్రేయస్ అయ్యర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్  యావరేజ్ 50 గా ఉంది. పదేళ్ల నుంచి శ్రేయస్ అయ్యర్ దీనిని 52 పెంచుకున్నాడు. ఇది ఎంత సులభమైన విషయం కాదు దీని వెనుక ఎంతో కఠోరమైన శ్రమ ఉంది.




 అయితే ఇదే ఆటతీరును  అంతర్జాతీయ మ్యాచుల్లో కొనసాగించడం మాత్రం పెద్ద సవాల్గా మారుతోంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ మ్యాచ్లో కూడా శ్రేయస్ అయ్యర్  అద్భుతంగా రాణిస్తూ ఉన్నాడని ఇటీవలే ముగిసిన టెస్టు సిరీస్లో శ్రేయస్ అయ్యర్ ప్రదర్శన అద్భుతంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే సౌతాఫ్రికా టూర్ శ్రేయస్ అయ్యర్ కు అసలు పరీక్ష కాబోతున్నట్లు సౌరవ్ గంగూలీ అన్నాడు. బౌన్సీ పిచ్లపై శ్రేయస్ అయ్యర్ ఎలా ఆడుతాడు ఎలా ప్రతిభను కనబరుస్తాడు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది అంటూ చెప్పుకొచ్చాడు. సౌతాఫ్రికా టూర్ యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కు అసలైన పరీక్ష అంటూ తెలిపాడు. సౌత్ ఆఫ్రికా లాంటి బౌన్సీ పిచ్లను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొంటే మేటి బ్యాట్స్మెన్  అవుతాడు అంటూ చెప్పుకొచ్చాడు సౌరవ్ గంగూలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: