టీ20ల్లో సెన్సేషన్.. పాకిస్తాన్ కొత్త రికార్డు?

praveen
గత కొన్ని రోజుల నుంచి పాకిస్థాన్ జట్టు టి-20 లో దూసుకుపోతూ ఉంది అన్న విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేని విధంగా ఎంతో మెరుగైన ప్రదర్శన చేస్తూ ఏకంగా ప్రపంచ క్రికెట్లో దిగ్గజ దిగ్గజాలుగా ఉన్న జట్లను సైతం ఓడిస్తుంది. బౌలింగ్ విభాగంలో బ్యాటింగ్ విభాగంలో ఎంతో పటిష్టంగా కనిపిస్తుంది పాకిస్తాన్ జట్టు. బాబర్ అజాం  కెప్టెన్సీలో జట్టు ఎంతో సమర్థవంతంగా ముందుకు నడుస్తుంది అని చెప్పాలి. ఇక ఇటీవలే టి20 వరల్డ్ కప్ లో కూడా సత్తా చాటింది పాకిస్తాన్ జట్టు.


 ఎలాంటి అంచనాలు లేకుండానే బరిలో దిగిన పాకిస్థాన్ జట్టు వరుసగా విజయాలు సాధించి దూసుకుపోయింది. ఏకంగా క్రికెట్లో దిగ్గజ జట్లుగా కొనసాగుతున్న ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా కు సైతం సాధ్యం కాని రీతిలో వరుస విజయాలను సాధించింది పాకిస్థాన్ జట్టు. కానీ చివర్లో సెమీఫైనల్లో కాస్త తడబడడంతో చివరికి ఓటమి పాలయింది. ఒకానొక దశలో పాకిస్థాన్ జట్టు ఫైనల్లో అడుగుపెడుతుంది అని అనుకున్నారు అందరు. కానీ సెమీ ఫైనల్లో నిష్క్రమించింది పాకిస్తాన్ జట్టు.



 ఇకపోతే కొన్ని దశాబ్దాల తర్వాత మొదటి సారి పాకిస్థాన్లో పర్యటనకు వెస్టిండీస్ జట్టు సిద్ధమయ్యింది. ఇక ఇప్పుడు కరాచీ వేదికగా పాకిస్తాన్ వెస్టిండీస్ మొదటి 20 సిరీస్ జరుగుతుంది. తొలి టీ-20 మ్యాచ్లో వెస్టిండీస్ జట్టుపై పాకిస్థాన్ విజయం సాధించింది. బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 200 పరుగుల చేసింది. ఆ తర్వాత భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్ విభాగం పూర్తిగా విఫలం అయింది. కేవలం 137 పరుగుల 19 ఓవర్లలో ఆలౌట్ అయింది వెస్టిండీస్ జట్టు.. 43 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది పాకిస్థాన్ జట్టు. అయితే ఏడాది వ్యవధిలో 18 టీ20 లలో గెలిచిన తొలి జట్టుగా పాకిస్తాన్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: