
రోహిత్ ప్రమోషన్ క్యాన్సిల్.. కెప్టెన్గా విరాట్ కోహ్లీ?
టి20 వరల్డ్ కప్ తర్వాత టీమ్ ఇండియా టి20 కెప్టెన్ గా విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు.. దీంతో టీమ్ ఇండియా టి20 జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్ రోహిత్ శర్మ నియమించింది బీసీసీఐ. అయితే ఆతర్వాత వన్డే ఫార్మాట్ కు రోహిత్ శర్మకు కెప్టెన్ నియమిస్తారూ అన్నదానిపై చర్చ మొదలయింది. దీంతో టీ20, వన్డే లాంటి పరిమిత ఓవర్ల ఫార్మాట్ కి రోహిత్ శర్మ ను కెప్టెన్ గా నియమించి ఇక టెస్టు ఫార్మాట్లో విరాట్ కోహ్లీని కెప్టెన్ కొనసాగించేఅవకాశం ఉందని భావించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం టి20 కెప్టెన్గా కొనసాగుతున్న రోహిత్ కు మరి కొన్ని రోజుల్లో వన్డే కెప్టెన్ గా కూడా ప్రమోషన్ రాబోతుందని అనుకున్నారు.
కానీ ప్రస్తుతం రోహిత్ శర్మ ప్రమోషన్ కాస్త క్యాన్సల్ అయినట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీ పగ్గాలు చేపట్టేందుకు మరింత సమయం పట్టవచ్చని ఇటీవల టైమ్స్ ఆఫ్ ఇండియా అభిప్రాయం వ్యక్తం చేసింది. సౌత్ ఆఫ్రికా కు వెళ్లే భారత జట్టును ప్రకటించిన సమయంలో రోహిత్ ను కొత్త కెప్టెన్ గా నియమిస్తూ బీసీసీఐ ప్రకటన చేస్తుందని అందరూ భావించినప్పటికీ... సౌతాఫ్రికా పర్యటనలో వన్డేలకు కోహ్లీ కెప్టెన్ గా కొనసాగించాలని భావిస్తున్నట్టున్నారట. ఇక ఆ తర్వాతె వన్డేలకు రోహిత్ శర్మ కెప్టెన్సీ చేపట్టే అవకాశం ఉందని ప్రస్తుతం కొత్త టాక్ వినిపిస్తోంది.