
పాపం.. నటరాజన్ ను బ్యాడ్ లక్ వదలట్లేదుగా?
ఇక ఐపీఎల్ లో నటరాజన్ చేసిన ప్రతిభకు అటు బిసిసిఐ సెలెక్టర్లు కూడా ఫిదా అయ్యారు అనే చెప్పాలి. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా టి20 జట్టు లో అవకాశాన్ని కల్పించారు. అయితే మొదట టీమిండియా టీ-20 జట్టులో అవకాశాన్ని దక్కించుకున్న నటరాజన్ ఒకే పర్యటనలో మూడు ఫార్మాట్లలో కూడా అవకాశం దక్కించుకుని సంచలనమే సృష్టించాడు అని చెప్పాలి. వరుసగా టెస్ట్ వన్డే టీ20 సిరీస్ లలో కూడా అవకాశాలు దక్కించుకున్నాడు. దీంతో ఇక టీమిండియాలో నటరాజన్ కు తిరుగులేదు అని అందరూ భావించారు. కానీ ఆ తర్వాత మాత్రం ఎక్కడా తెరమీద కనిపించకుండా పోయాడు నటరాజన్.
నటరాజన్ గాయాల బెడద ఇబ్బంది పెడుతూనే ఉంది. గతంలో మోకాలి గాయం కారణంగా అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన నటరాజన్ ఇటీవలె గాయం బారినుంచి కోలుకొని దేశవాళీ టోర్నీ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో కేవలం ఫైనల్ మ్యాచ్లో మాత్రమే ఆడాడు నటరాజన్. కాని అంతలోనే మళ్లీ దురదృష్టం తలుపు తట్టింది. ఇటీవలే విజయ్ హజారే ట్రోఫీ కి దూరమయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఫైనల్ ఆడిన నటరాజన్ మళ్లీ మోకాలి గాయం బారిన పడ్డాడు. పాత గాయం తిరగబెట్టడం తో మళ్ళీ హాస్పిటల్ పాలు అయ్యాడు నటరాజన్. దీంతో ఫ్యాన్స్ అందరూ కూడా నిరాశ లో మునిగిపోయారు.