టీమిండియాతో సిరీస్ అర్థం పర్థం లేనిది.. కివీస్ బౌలర్ షాకింగ్ కామెంట్స్?
ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీ లో ఆడిన తొలి టీ-20 సిరీస్లో శుభారంభం చేసింది. ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే అద్భుతం గా రాణించిన టీమిండియా వరుసగా రెండు మ్యాచ్లలో గెలిచి సిరీస్ను కైవసం చేసుకుంది. ఇక నేడు నామమాత్రపు మ్యాచ్లో కూడా గెలిచి సొంతగడ్డపై న్యూజిలాండ్ జట్టును చిత్తుగా ఓడించాలని టీమిండియా భావిస్తోంది. అయితే అటు టీమిండియాకు న్యూజిలాండ్ జట్టు కనీస పోటీ ఇవ్వలేక పోతోంది అని చెప్పాలి. న్యూజిలాండ్ జట్టు భారత్ లో టీమిండియా తో టీ20 సిరీస్ ఆడటంపై స్పందించిన న్యూజిలాండ్ బౌలర్ మిచెల్ మెక్లగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
టీమ్ ఇండియా న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టి20 సిరీస్ కి అర్థం పర్థం లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రపంచ కప్ ఫైనల్ ముగిసిన తర్వాత డబ్భై రెండు గంటల్లోనే భారత్తో సిరీస్ జరపడం వేస్ట్ అంటూ వ్యాఖ్యానించాడు. న్యూజిలాండ్ జట్టు టి-20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఓడి నేరుగా భారత్ కు చేరుకుంది. కనీసం న్యూజిలాండ్ జట్టుకు విశ్రాంతి లేకుండానే బరిలోకి దిగింది. ఇలా అర్ధాంతరంగా సిరీస్ నిర్వహించడం సరైన పద్ధతి కాదు అంటూ న్యూజిలాండ్ మిచెల్ మెక్లగన్ అన్నాడు.