రోహిత్ శర్మ నిర్ణయం ఒక మిస్టరీ : రాబిన్ ఉతప్ప

praveen
మొన్నటివరకు టీమ్ ఇండియా లోని అన్ని ఫార్మాట్లకు కూడా కెప్టెన్గా విరాట్ కోహ్లీ కొనసాగాడు. అయితే టి20 వరల్డ్ కప్ కి ముందు తాను టి20 కెప్టెన్సీ బాధ్యతలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు కోహ్లీ. వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్సీ నుంచి వైదొలగుతానని అంటూ విరాట్ కోహ్లీ ప్రకటించాడు.ఈ క్రమంలోనే ఇక వరల్డ్ కప్ ముగిసిన తర్వాత చెప్పిన విధంగానే కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో రోహిత్ శర్మ మొదటి సారి పూర్తి స్థాయి టీమిండియా కెప్టెన్ గా మారిపోయాడు. అయితే అదే సమయంలో అటు రాహుల్ ద్రావిడ్ టీమిండియా హెడ్ కోచ్ గా మారి పోవడం గమనార్హం.


 ఇకపోతే ఇప్పటికే టీ20 కెప్టెన్గా ఐపీఎల్ లో తన సత్తా ఏంటో చూపించాడు రోహిత్ శర్మ. అటు  ముంబై ఇండియన్స్ జట్టును ఎంతో విజయవంతంగా ముందుకు నడిపించి ఐదుసార్లు టైటిల్ విజేతగా నిలిచాడు. అయితే ఇక ఇప్పుడు టీమిండియా జట్టును కూడా ఎంతో సమన్వయంతో ముందుకు తీసుకెళుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా టి20 సిరీస్ ఆడుతున్న టీం ఇండియా ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్లలో గెలిచి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుతో ఆడుతున్న టి20 సిరీస్ లో ఎంతో మంది యువ ఆటగాళ్లు టీమిండియాలో అవకాశం దక్కించుకున్నారు.


 ఇలాంటి వారిలో ఐపీఎల్ స్టార్ వెంకటేష్ అయ్యర్ కూడా ఒకరు. అయితే ఇండియాలో అడుగుపెట్టిన వెంకటేష్ అయ్యర్ కేవలం బ్యాటింగ్ కి మాత్రమే పరిమితం అవుతున్నాడు. ఇప్పటివరకు రోహిత్ ఒకసారి కూడా వెంకటేష్ అయ్యర్ కి బౌలింగ్ చేసేందుకు అవకాశం ఇవ్వలేదు. అయితే ఈ నిర్ణయంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. న్యూజిలాండ్ సిరీస్లో అరంగేట్రం చేసిన ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ తో బౌలింగ్ చేయించకాపోవడం మిస్టరీ గా మారిందని టీమిండియామాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప విమర్శలు గుప్పించాడు . జట్టులో హార్దిక్ పాండ్యా లేని లోటును వెంకటేష్ అయ్యర్ తో పూడూస్తారు అని అందరూ భావించారు. కానీ వెంకటేష్  అయ్యర్ ను  కేవలం బ్యాటింగ్ కి మాత్రమే పరిమితం చేస్తున్న రోహిత్ శర్మ అతనికి బౌలింగ్ ఇవ్వకపోవడం మిస్టరీగా మారింది అంటూ చెప్పుకొచ్చాడు రాబిన్ ఉతప్ప.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: