వచ్చే ఏడాది ప్రపంచ కప్ నుండి.. న్యూజిలాండ్ ఔట్?
అయినప్పటికీ ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చేసేదేమీలేక బయో బబుల్ లోనే ఆటగాళ్ల ను వుంచి క్రికెట్ మ్యాచ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి నేపథ్యంలోనే కొంతమంది స్టార్ ఆటగాళ్లు సైతం బయో బబుల్ లో మానసికంగా అలిసిపోయి క్రికెట్ కి కొంచెం బ్రేక్ తీసుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇటీవలే ఈ విషయంలో ఆలోచనలో పడింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు. కీలక నిర్ణయం తీసుకుంది. 2022 లో జరగబోయే ప్రపంచ కప్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.
2022 లో వెస్ట్ ఇండీస్ లో అండర్ 19 ప్రపంచ కప్ జరగబోతుంది. ఈ ప్రపంచకప్ నుంచి తాము తప్పు కుంటున్నాము అంటూ ఇటీవల న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఒకవేళ ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొంటే ఆ తర్వాత స్వదేశంలో ఆటగాళ్లపై క్వారంటైన్ నిబంధనలు అమలు చేయాల్సి ఉంటుంది. ఇక ఈ కారణంగానే ప్రపంచ కప్ లో పాల్గొనడానికి విముఖత వ్యక్తం చేస్తున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అయితే ప్రస్తుతం ప్రపంచ కప్ నుంచి న్యూజిలాండ్ జట్టు తప్పుకోవడంతో ఇక ఆ స్థానంలో స్కాట్లాండ్ అవకాశం దక్కించుకుంది. ఇక ఈ టోర్నీలో పాల్గొనే 16 జట్లు 4 గ్రూపులుగా విభజించగా భారత్ బి గ్రూపులో కొనసాగుతోంది.