వారెవ్వా.. కేన్ మామ.. ఎంత హుందాతనం.. ఎంత క్రీడాస్ఫూర్తి?

praveen
కేన్ విలియమ్సన్ కెప్టెన్ గా మారిన తర్వాత పసికూన గా ఉన్న న్యూజిలాండ్ జట్టును దిగ్గజ జట్టుగా మార్చాడు. విశ్వ వేదికపై పటిష్టంగా తలపడుతూ జట్టును నిలబెడుతూ అద్భుతమైన ప్రతిభతో అందరిని ఆకర్షిస్తున్నాడు. ప్రస్తుతం ఒక దిగ్గజ కెప్టెన్గా ఎదుగుతున్నాడు కేన్ విలియమ్సన్. అయితే మొట్టమొదటి వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ జట్టుకు ఆ తర్వాత ఇటీవల జరిగిన టి20 వరల్డ్ కప్ టోర్నీలో మాత్రం నిరాశే మిగిలింది. ఫైనల్ పోరు వరకూ అద్భుత ప్రతిభ కనబరిచిన న్యూజిలాండ్ జట్టు ఫైనల్ పోరులో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలయ్యింది. అయితే ఇక ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్  తీసుకోగానే  న్యూజిలాండ్ అభిమానుల ఆశలపై కాస్త నీళ్లు చల్లినట్లు అయ్యింది.



 ఆ తర్వాత మొదట బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఒక భారీ స్కోరు చేయగలిగింది. ఈ క్రమంలోనే మరోసారి న్యూజిలాండ్ అభిమానుల్లో గెలుస్తుందన్న నమ్మకం వచ్చింది  కానీ ఆ తర్వాత ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ లు అద్భుతంగా రాణించడంతో ఆస్ట్రేలియా జట్టు ముందు కొండంత ఉన్న లక్ష్యం కాస్త కొవ్వొత్తిలా కరిగిపోయింది. దీంతో మొదటి సారి పొట్టి ఫార్మాట్ విజేతగా నిలవాలి అనుకున్న కేన్ విలియమ్సన్ జట్టుకు భంగపాటు తప్పలేదు. అయితే ఇలా ఓటమి తర్వాత అటు మీడియా ప్రతినిధుల నుంచి కెప్టెన్లకు చిత్రవిచిత్రమైన ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి అన్నది తెలిసిందే.



 తన చిరకాల కోరిక నెరవేరింది... ఇక పొట్టి క్రికెట్లో విముక్తి లభించింది అంటూ గెలిచిన సంతోషం లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు పాటలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఇక న్యూజిలాండ్ జట్టు దురదృష్టాన్ని వెక్కిరించే విధంగా ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు. 3 వరల్డ్ కప్ టోర్నీలో ఫైనల్లో ఓడిపోవడం ఎలా అనిపిస్తుంది అని అడుగగా ఎలాంటి తడబాటు లేకుండా టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ గురించి మర్చిపోయినట్టున్నారు అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఆడేందుకు ఇక్కడికి వచ్చాం. ఆట అన్న తర్వాత గెలుపు ఓటములు సహజం ఈ టోర్నీలో ఈ ప్రదర్శన పట్ల నేను ఎంతో గర్వ పడుతున్నాను. ఫైనల్లో ఆస్ట్రేలియా ఎంతో బాగా ఆడింది. పక్కనే వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చూడండి. వాళ్ళ ఆట అత్యద్భుతం అద్భుతమైన ఆటగాళ్లు జట్టును ఛాంపియన్గా నిలవడానికి ఎంతగానో కృషి చేశారు అంటూ ఎంతో హుందాగా ప్రవర్తించి క్రీడా స్ఫూర్తిని చాటాడు కేన్ విలియమ్సన్. దీంతో విలియమ్సన్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: