ప్రపంచ కప్ ఫైనల్.. ఆ ఇద్దరు పైనే అందరి చూపు?
ఈ క్రమంలోనే అటు న్యూజిలాండ్ జట్టుకు చిరకాల ప్రత్యర్థిగా ఉన్న ఇంగ్లండ్ జట్టుతో సెమీఫైనల్లో భాగంగా మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్ జరుగుతున్నంత సేపు 2019 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూస్తున్నట్లుగా అని ప్రేక్షకులు అందరూ భావించారు. ఇక ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు విజయం సాధించింది. అయితే న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ మిచెల్ స్టార్క్ అద్భుతంగా రాణించడంతో ఇక అలవోకగా సెమీ ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించగలిగింది న్యూజిలాండ్ జట్టు. రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కూడా ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్ జట్టుపై ఎంతో క్లిష్ట పరిస్థితుల మధ్య విజయాన్ని సాధించడం గమనార్హం.
ఆస్ట్రేలియా జట్టు సెమీఫైనల్లో ఓడి పోతుందేమో అని అనుకుంటున్న సమయంలో ఆస్ట్రేలియా ఆటగాడు మాత్యు వేడ్ అద్భుతంగా రాణించాడు వరుసగా బౌండరీలతో అదరగొట్టాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది. ఇక ఫైనల్లో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. దీంతో న్యూజిలాండ్‌కు చెందిన మిచెల్ స్టార్క్.. ఆస్ట్రేలియా జట్టుకు చెందిన మాత్యు వేడ్ పైన అందరి దృష్టి ఉంది. సెమీఫైనల్లో అద్భుతంగా రాణించినట్టు గానే ఫైనల్ మ్యాచ్‌లో కూడా రాణించి జట్టుకు ఇద్దరిలో ఎవరు విషయాన్ని అందించబోతున్నారు అన్నది మాత్రం ప్రస్తుతం ఆసక్తి కరం గా మారిపోయింది.