ఐసియు నుండి వచ్చి.. 67 పరుగులు చేశాడు?
మొదటి విజయంతోనే చరిత్ర సృష్టించిన పాకిస్థాన్ జట్టు ఇక ఆ తర్వాత కూడా అదే రీతిలో అద్భుతంగా రాణించింది. ప్రతి మ్యాచ్లో కూడా ప్రత్యర్థికి ఎక్కడ అవకాశం ఇవ్వకుండా అద్భుతంగా రాణించి వరుస విజయాలను అందుకుంది పాకిస్థాన్ జట్టు. ఇలా ఆడిన నాలుగు మ్యాచ్ లలో కూడా విజయం సాధించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక సెమీఫైనల్లో ఇటీవలే ఆస్ట్రేలియాతో తలపడింది పాకిస్థాన్ జట్టు అయితే మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు పెద్దగా పరుగులు చేయలేదు అని అనుకున్నారు అందరు. కానీ మొదట బ్యాటింగ్ చేసినప్పటికీ ఇక పాకిస్తాన్ బ్యాట్స్మెన్లు బాగా రాణించారు. ముఖ్యంగా పాకిస్తాన్ విజయంలో కీలకపాత్ర పోషిస్తున్న మహమ్మద్ రిజ్వాన్ సెమి ఫైనల్ లో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 67 పరుగులతో రాణించాడు.
అయితే మహమ్మద్ రిజ్వాన్ కి క్రికెట్ పట్ల ఉన్న అంకితభావానికి ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం ఫిదా అవుతుంది అని చెప్పాలి. ఎందుకంటే నిన్న సెమీ ఫైనల్ మ్యాచ్లో 67 పరుగుల తో అద్భుతంగా రాణించిన మహమ్మద్ రిజ్వాన్ సరిగ్గా రెండు రోజుల క్రితం ఐసీయూలో లేవలేని స్థితిలో చికిత్స తీసుకున్నాడు. నవంబర్ 9న రిజ్వాన్ చాతిలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చింది. దీంతో అతడు ఆస్పత్రిలో చేరాడు. ఈ క్రమంలోనే అతని ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందించారు. కానీ సెమీ ఫైనల్ మ్యాచ్ కోసం ఏకంగా ఐసియు నుంచి నేరుగా మైదానంలోకి వచ్చేసాడు. అంతే కాదు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఏకంగా 67 పరుగులు చేసి అందరిని ఆకట్టుకున్నాడు. ఇక అతని అంకితభావానికి అందరూ సలామ్ కొడుతున్నారు.