24 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ కు ఆస్ట్రేలియా.. ఏం జరగబోతుందో?
కానీ గత కొంత కాలం నుంచి మాత్రం వివిధ క్రికెట్ జట్లు పాకిస్థాన్ పర్యటనకు వెల్లెందుకు మొగ్గు చూపుతూ ఉండటం గమనార్హం. అయితే ఇటీవలే ఇంగ్లాండ్ జట్టు పాకిస్థాన్లో పర్యటించాలి అనుకుంది.. దీనికోసం షెడ్యూలు కూడా విడుదల చేసింది. కానీ ఆ తర్వాత మాత్రం భద్రతాపరమైన కారణాల దృష్ట్యా పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకుని షాక్ ఇచ్చింది ఇక ఆ తర్వాత న్యూజిలాండ్ జట్టు కూడా ఇలాంటి తరహా నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు మాత్రం పాకిస్థాన్ పర్యటనకు వెళ్లేందుకు వివిధ జట్లు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే 24 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పాకిస్థాన్లో పర్యటించనుంది. వచ్చే ఏడాది ఈ రెండు జట్లు 3 టెస్టులు 4 పరిమిత ఓవర్ల మ్యాచ్ లలో తలపడుతున్నాయి. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్ పర్యటనకు ఒప్పుకుంది. కానీ ఇక ఇటీవల ఇంగ్లాండ్, న్యూజిలాండ్ షాక్ ఇచ్చినట్లుగానే ఆస్ట్రేలియా కూడా చివరి నిమిషంలోఏదైనా ట్విస్ట్ ఇవ్వబోతుందా అన్నది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇటీవల టి20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ చూపు మొత్తం ఇక ఆ జట్టు పైకి వెళిపోయింది.