టీమిండియా ఫైనల్స్ కి రావాలి.. పాక్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్?
అయితే ఇప్పటి వరకు చరిత్రలో ఎన్నడూ కూడా భారత జట్టుపై విజయం సాధించని పాక్ మొదటిసారి విజయం సాధించడంతో పాకిస్తాన్ అభిమానులను ఆనందంలో మునిగిపోయారు.అయితే ఈ మ్యాచ్ జరిగి రోజులు గడిచి పోతున్నాయి. ఇప్పటికీ ఈ మ్యాచ్ కి సంబంధించిన చర్చలు జరుగుతూనే ఉంది. అయితే పాకిస్థాన్తో ఓటమి తర్వాత న్యూజిలాండ్ చేతిలో కూడా ఓడిపోయిన టీమిండియా సెమిస్ అవకాశాలను ఎంతో కష్టంగా మార్చుకుంది. ప్రస్తుతం టీమిండియా అసలు సెమిస్ చేరుతుందా లేదా అన్నది కూడా ప్రస్తుతం డౌట్ గా మారింది. ఇలాంటి సమయంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియాను ఫైనల్స్లో చూడాలి అనుకుంటున్నా అంటూ షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయితే పాకిస్థాన్ క్రికెటర్ టీమిండియాను ఫైనల్స్ లో చూడాలనుకోవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు కదా.. దీని వెనుక కారణం కూడా ఉంది. టీమిండియా ఫైనల్స్కు వస్తే అక్కడ పాకిస్తాన్ జట్టు మరోసారి టీమిండియాను ఓడిస్తే చూడాలని ఉంది అంటూ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా తమను ఓడించడానికి మరో అవకాశం ఇవ్వాలి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన యూట్యూబ్ ఛానల్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేసాడు షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయి.