ఇండియా vs ఆఫ్ఘనిస్తాన్.. అలా జరిగితేనే భారత్ గెలుస్తుంది?

praveen
టి20 వరల్డ్ కప్ లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా ఇక వరుస విజయాలు సొంతం చేసుకుంటూ అటు వరల్డ్ కప్ లో  సత్తా చాటి సెమీస్కు దూసుకు పోతుంది అని అనుకున్నారు. అయితే ఈసారి టీమిండియా కప్ గెలవడం పక్క అని భావించారు. ఎందుకంటే టి20 వరల్డ్ కప్ తర్వాత విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీకి గుడ్ బాయ్ చెప్పబోతున్నాడు. దీంతో ఇక చివరి సారిగా టీమిండియాకు వరల్డ్ కప్ అందించి కెప్టెన్సీకి స్వస్తి పలికి బోతున్నాడు అని అందరూ భావించారు. కానీ టీమిండియా పరిస్థితి అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి గా మారిపోయింది.


 ఈసారి టీమిండియా కప్ గెలవడం పక్క అనే భారీ అంచనాలు పెట్టుకోగా ఇలా ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా మాత్రం పేలవ ప్రదర్శన చేసి సెమీస్ అవకాశాలను ఎంతో క్లిష్టంగా మార్చుకుంది. ఇక టి20 వరల్డ్ కప్ కప్ గెలవడం దేవుడెరుగు కనీసం టీమ్ ఇండియా సెమీ ఫైనల్కు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. టి20 వరల్డ్ కప్ లో జరిగిన మ్యాచ్ లో వరుసగా రెండు మ్యాచ్లలో ఘోర పరాజయాన్ని చవిచూసింది టీమిండియా. ప్రత్యర్థికి కనీస పోటీ ఇవ్వలేకపోయింది. అయితే ప్రస్తుతం టీమిండియాకు సెమీస్ వెళ్లే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నప్పటికీ పరువు నిలబెట్టుకోవడానికి మాత్రమే టీమిండియా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


 టి20 వరల్డ్ కప్ లో భాగంగా నేడు అబూధాబీ వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా టాస్ గెలవాల్సిన పరిస్థితి ఉంది. లేదంటే మళ్లీ ఓటమి చవి చూసే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే నేడు అబుదాబి వేదికగా మ్యాచ్ జరగబోతున్న స్టేడియంలో పిచ్ మీద ఇప్పటివరకు 8 మ్యాచ్లు జరిగాయి. అయితే ఈ ఎనిమిది మ్యాచ్ లలో కూడా ఆరు సార్లు చేసిన ఛేజింగ్ చేసిన జట్టు విజయం సాధించడం గమనార్హం. కాగా ఇక ఈ మ్యాచ్లో కోహ్లీసేన టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకొని ఛేజింగ్ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయని లేదంటే టీమిండియా గెలవడం కష్టమే అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: