టి20 వరల్డ్ కప్ : ఒకరిది ఆశ.. మరొకరిది పరువు?

praveen
ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన టి20 వరల్డ్ కప్ ప్రస్తుతం ప్రారంభం అయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టి20 వరల్డ్ కప్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠభరితంగా  జరుగుతుంది. అయితే కరోనా వైరస్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన టి20 వరల్డ్ కప్ ఇటీవలే  ప్రారంభం కావడంతో ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ఫాన్స్ అందరు ఎంతగానో కృషి అవుతున్నారు అని చెప్పాలి. టి20 వరల్డ్ కప్ లో భాగంగా ప్రస్తుతం ప్రతి మ్యాచ్ కూడా నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఎంతో హోరాహోరీగా జరుగుతోంది. ఇక ప్రస్తుతం స్టేడియంకు ప్రేక్షకులను కూడా అనుమతిస్తూ ఉండడంతో ఎంతోమంది దుబాయ్ చేరుకుని ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.



 ఇక మరికొంతమంది అటు టీవీల ముందు కూర్చుని మ్యాచ్ వీక్షిస్తూ వుండటం గమనార్హం. కాగా టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఇప్పటికే సెమీ ఫైనల్లో స్థానం దక్కించుకున్న జట్లు ఏవి అన్న విషయంఫై దాదాపుగా అందరికీ క్లారిటీ వచ్చేసింది. అయితే ఇప్పటికే పలు జట్లు వరుస ఓటముల కారణంగా సెమీ ఫైనల్లో స్థానం దక్కించుకోలేక ఇంటి బాట పట్టయ్. కేవలం టి20 వరల్డ్ కప్ లో భాగంగా పరువు నిలబెట్టుకోవడానికి మాత్రమే మ్యాచ్ ఆడుతూ ఉండటం గమనార్హం. ఇదే సమయంలో కొన్ని జట్లు ఇంకా సెమీ ఫైనల్లో స్థానం దక్కించుకోవడానికి క్లిష్ట పరిస్థితిలో ఉండగా ఇక వరుసగా మ్యాచ్ లలో గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది.



 ఈ క్రమంలోనే ప్రస్తుతం టి20 వరల్డ్ కప్ లో భాగంగా నేడు ఒక ఆసక్తికర మ్యాచ్ జరగబోతుంది. ఇక ఈ మ్యాచ్లో భాగంగా ఒక జట్టు సెమీ ఫైనల్లో స్థానం దక్కించుకోవడానికి తలపడుతూ ఉండగా.. మరో జట్టు టి-20 వరల్డ్ కప్ లో పరువు నిలబెట్టుకోవడానికి తలపడుతుంది. నేడు టి20 వరల్డ్ కప్ లో భాగంగా గ్రూప్ వన్ నుంచి సౌత్ ఆఫ్రికా బంగ్లాదేశ్  మధ్య మ్యాచ్ జరగబోతోంది   మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు వరకు సౌత్ ఆఫ్రికా జట్టు మూడు మ్యాచ్లు ఆడగా రెండింటిలో విజయం సాధించింది. దీంతో సెమీ ఫైనల్లో స్థానం తగ్గించుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఈ మ్యాచ్లో గెలవాల్సి ఉంది. అదే సమయంలో బంగ్లాదేశ్ జట్టు ఇప్పుడు వరకు ఆడిన మూడు మ్యాచ్ లు కూడా ఓడిపోయింది. దీంతో ప్రస్తుతం పరువు నిలబెట్టుకోవడానికి నేడు సౌతాఫ్రికాతో పోరు కొనసాగించబోతుంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: