నేడే కీలక మ్యాచ్...భారత్ గెలిచి నిలిచేనా?
ముఖ్యంగా భారత్ అభిమానులు ఒక క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లాగా చూస్తున్నారు. ఇండియా పాక్ తో ఆడిన మ్యాచ్ లో ఓటమి పాలవ్వడంతో ఇది చావో రేవో మ్యాచ్ అని చెప్పాలి. గ్రూప్ 2 లో ఉన్న ఆరు జట్లలో ఇప్పటి వరకు చూస్తే సెమీస్ కు వెళ్లే ఛాన్సెస్ పాకిస్తాన్, ఇండియా మరియు న్యూజిలాండ్ లలో ఏ రెండు టీం లకు మాత్రమే ఉన్నాయి . అయితే సంచలనాలకు మారుపేరైన ఆఫ్గనిస్తాన్ ను తేలిగ్గా తీసుకోలేము. కోహ్లీ సేన ఈ రోజు మ్యాచ్ లో ఏ విధమైన వ్యూహాలతో బరిలోకి దిగనుందో తెలియాల్సి ఉంది.
అటు న్యూజిలాండ్ కి సైతం ఇది మస్ట్ విన్ గేమ్. కాబట్టి ఈ సాయంత్రం వీరిద్దరి మధ్య జరిగే మ్యాచ్ చాలా ఉత్కంఠగా ఉండే అవకాశం ఉంది. అయితే న్యూజిలాండ్ కు లాకీ ఫెర్గుసన్ గాయంతో సీజన్ కు దూరమవ్వడం ప్రతికూలమని చెప్పాలి. మరి ఈ మ్యాచ్ లో గెలిచి ఎవరు సెమీఫైనల్ కు అత్యంత చేరువవుతారు అన్నది తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.