టీ 20 ప్రపంచ కప్ ఫైనల్ కు చీఫ్ గెస్ట్ మోదీ కాదా? మరెవ్వరు?

VAMSI
ఐపిఎల్ లాంటి మెగా టోర్నీ పూర్తి అయిన మూడు రోజులకే టీ 20 ప్రపంచ కప్ ను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. కరోనా లాంటి పరిస్థితులను అధిగమించి సక్సెస్ ఫుల్ గా ప్రపంచ కప్ జరగడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం యూఏఈ వేదికగా సూపర్ 12 మ్యాచ్ లు ఎంతో ఆసక్తిగా జరుగుతున్నాయి. నవంబర్ మొదటి వారంలో లీగ్ మ్యాచ్ లు పూర్తి కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం సెమీఫైనల్ నవంబర్ 10 మరియు 11 వ తేదీలలో జరగనున్నాయి. ఆ తర్వాత రెండు రోజుల గ్యాప్ తో ఫైనల్ 14 వ తేదీన జరగనుంది. దీనితో టీ 20 ప్రపంచ కప్ ముగిసిపోతుంది. ప్రస్తుతం ఈ టోర్నీ యూఏఈ దేశంలో జరుగుతోంది, అందుకే ఇండియా నుండి ఫైనల్స్ కు అతిథిగా ఎవరో ఒకరిని పిలవాల్సి ఉంది.
కానీ ఈ అతిధి ఎవరు అన్న విషయంపై చాలా చర్చలు జరుగుతున్నాయి. అయితే బీసీసీఐ నుండి తెలుస్తున్న సమాచారం ప్రకారం బీసీసీఐ అధ్యక్షుడు గా ఉన్న సౌరవ్ గంగూలీ  ఫైనల్ మ్యాచ్ కు అతిథిగా రావాలని వెస్ట్ బెంగాల్  సీఎంగా ఉన్న మమతా బెనర్జీకి అహ్వనం పంపినట్లు తెలుస్తోంది. మమతా బెనర్జీ మరియు సౌరవ్ గంగూలీకి మధ్యన ఉన్న సాన్నిహిత్యం, అలాగే ఒక లేడీ పొలిటికల్ లీడర్ గా మమతా అంటే గౌరవం వంటి కారణాల వలన ఈమెను ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. పైగా ఈమెకు క్రికెట్ అంటే చాలా  ఇష్టం. అందుకే ఈమెను పిలిచినట్లు సమాచారం. కానీ వాస్తవానికి ఆమె ఇప్పుడు రాష్ట్రంలో లేదట...వచ్చాక ఈ విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
మరి సౌరవ్ ఆహ్వానానికి మమతా ఓకె చెబుతుందా లేదా అన్నది చూడాలి. మరి మమతా వస్తారా రారా అన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే దేశ ప్రధాని నరేంద్ర మోదీని కాదని ఒక సీఎంను ముఖ్య అతిధిగా ఆహ్వానించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయం పొలిటికల్ గా ఎంత దూరం వెళుతుందా అన్నది తెలియాల్సి ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: