ఇండియా సెమీఫైనల్ చేరాలంటే?
మరి ఇండియా సెమీస్ చేరడానికి గల అవకాశాలను ఒకసారి చూద్దాం,
ఈ గ్రూప్ 2 లో ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆఫ్గనిస్తాన్, నమీబియా మరియు స్కాట్లాండ్ జట్లు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లను బట్టి చూస్తే స్కాట్లాండ్ అనధికారికంగా సెమీఫైనల్ కు దూరమైనట్టే అని తెలుస్తోంది. ఇక మిగిలింది 5 జట్లు మాత్రమే. వీరిలో 2 జట్లు సెమీఫైనల్ కు వెళ్లనున్నాయి. ఇప్పటికే ఆడిన 2 మ్యాచ్ లలోనూ విజయాలు సాధించి సెమీఫైనల్ కు పాకిస్థాన్ చేరువలో ఉంది. ఇండియా ఆదివారం న్యూజిలాండ్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలిస్తేనే తర్వాత ఏమైనా ఆలోచించగలము. ఒకవేళ ఇందులో ఓడితే మాత్రం చాలా కష్టం అయిపోతుంది.
మిగిలిన 4 మ్యాచ్ లలో 4 గెలవాల్సిన పరిస్థితి. న్యూజిలాండ్ మనతో ఓడిపోయి, మిగిలిన జట్లతో గెలిచినా మనకు ఇబ్బంది ఏమీ ఉండదు. అపుడు ఇండియా కు 4 విజయాలు ఉంటాయి, అలాగే న్యూజిలాండ్ కు 3 విజయాలు మాత్రమే ఉంటాయి. అయితే ఇక్కడ ఆఫ్గనిస్తాన్ ను కూడా తక్కువ అంచనా వేయలేము. నమీబియా కూడా బాగానే ఆడుతోంది. టీ 20 మ్యాచ్ లో ప్రత్యర్థి ఎవరైనా ప్రమాదంగా మారొచ్చు. కాబట్టి ప్రతి మ్యాచ్ ఫైనల్ లాగా ఆడితేనే ఇండియా సెమీఫైనల్ చేరుతుంది. మరి చూద్దాం ఏమి జరగనుందో.