అలా అయితే టి20 వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటా?

praveen
క్రికెట్ లో ఎంత గొప్ప ఆటగాడు అయినా సరే ఫామ్ లో ఉన్న సమయంలోనే అతనికి జట్టులో స్థానం ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఒక్కసారి ఫామ్ కోల్పోయాడు అంటే ఇక జట్టులో స్థానం దక్కుతుందా లేదా అని ప్రతి ఒక ఆటగాడు టెన్షన్ పడాల్సిందే క్రికెట్ అంటే అలాగే ఉంటుంది. సీనియర్ ఆటగాళ్లు అయిన జూనియర్ ఆటగాళ్లు అయిన ఎప్పుడూ ఫామ్ లో కొనసాగడం మాత్రం తప్పనిసరిగా ఉంటుంది  అయితే గత కొంతకాలం నుంచి తన ఫామ్ ను కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు ఇంగ్లాండ్ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్. ఇదే ప్రస్తుతం ఇంగ్లాండ్ క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది.

గత కొంత కాలం నుంచి ఇంగ్లాండ్ టి 20 క్రికెట్ జట్టుకి కెప్టెన్ గా కొనసాగుతున్నాడు ఇయాన్ మోర్గాన్   అయితే మొన్నటి వరకు అద్భుతమైన ఫామ్ లో ఉన్న ఇయాన్ మోర్గాన్ గత కొంత కాలం నుంచి మాత్రం తెగ ఇబ్బంది పడుతున్నాడు.  మ్యాచ్లో కూడా సరిగ్గా రాణించలేక పోతున్నాడు. భారీ అంచనాల మధ్య రంగంలోకి దిగుతు చివరికి పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తూ ఉన్నాడు ఇయాన్ మోర్గాన్. అయితే కనీస స్కోర్లు కూడా చేయకుండా మ్యాచ్ ఓటమి దిశగా తీసుకెళ్తున్నాడు ఇయాన్ మోర్గాన్.

 దీంతో ఈ స్టార్ ఆటగాడు పేలవ ఫామ్ పైనే ప్రస్తుతం చర్చ జరుగుతుంది. మరీ ముఖ్యంగా మరికొన్ని రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతున్న వేళ ఇయాన్ మోర్గాన్ అలాగే పేలవ ఫామ్ కొనసాగిస్తే  పరిస్థితి ఏంటి అని అందరూ భావిస్తున్నారు.  అయితే ఇటీవల దీనిపై ఈ స్టార్ క్రికెటర్ స్పందించాడు. టి20 వరల్డ్ కప్కు ముందు కీలక వ్యాఖ్యలు చేసాడు. తన ఫామ్ ఇలాగే కొనసాగితే ప్రపంచకప్ జట్టు నుంచి తప్పుకుంటాను అంటూ ప్రకటించాడు. తాను బ్యాటింగ్ లో విఫలం అవుతున్నప్పటికీ కెప్టెన్ గా మాత్రం రాణిస్తున్నా అంటూ తెలిపాడు. కాగా ఈ ఏడాది 37 ఇన్నింగ్స్ ఆడిన ఇయాన్ మోర్గాన్ అత్యధిక స్కోరు కేవలం 47 మాత్రమే కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: