ఐపీఎల్ ట్రోఫీ కంటే అదే ముఖ్యం.. కోహ్లీ కెప్టెన్సీపై ABD కామెంట్స్?

praveen
ఐపీఎల్ ప్రారంభం నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్గా కొనసాగిన విరాట్ కోహ్లీ ఇటీవలే తన కెప్టెన్సీకి స్వస్తి పలికాడు.  ఒకవైపు అంతర్జాతీయ టి20 కెప్టెన్సీకి స్వస్తి పలకడమే కాదు.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్గా కూడా తప్పు కుంటున్నాను అంటూ  తెలిపాడు. దీంతో అభిమానులు అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. అయితే  కోహ్లీ కెప్టెన్ గా తప్పుకోబోతున్నాడు కాబట్టి ఈసారి జట్టును టైటిల్ విజేతగా నిలుపుతాడు అని అందరూ అంచనాలు పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు దూకుడు చూస్తే కూడా అదే అనిపించింది.

 బ్యాటింగ్ విభాగంలో బౌలింగ్ విభాగంలో కూడా జట్టు ఎంతో పటిష్టంగా కనిపించడం.. వరుస విజయాలు సొంతం చేసుకోవడంతో ఇక  బెంగళూరు జట్టుకు అందని ద్రాక్షలా ఉన్న ఐపీఎల్ టైటిల్ ఈసారి గెలువబోతుంది అని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లుగానే పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో నిలిచి ఆఫ్  కి అర్హత సాధించింది.  కానీ ఎప్పటిలాగానే చివరి అడుగులో తడబడి చివరికి ఇంటి బాట పట్టింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.  ఎలిమినేటర్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు చేతిలో ఓడిపోయి ఇంటి బాట పట్టింది.  దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అభిమానులు అందరూ ఎంతగానో నిరాశలో మునిగిపోయారు.

 కోహ్లీ పూర్తిగా  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ ఉండడం అటు అభిమానులకు మరో నిరాశ అని చెప్పాలి. అయితే కోహ్లీ కెప్టెన్సిపై  ఇటీవలే ఆర్సీబీ జట్టు కీలక బ్యాట్మెన్ ఎబి డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇన్నాళ్ల పాటు ఆర్సిబి జట్టుకు కెప్టెన్గా కోహ్లీ ఉండడం తమ అదృష్టం  అంటూ చెప్పుకొచ్చాడు. కోహ్లీ కెప్టెన్సీలో ప్రతి సంవత్సరం నేను జట్టులో ఆడాను. కోహ్లీ కెప్టెన్సీ ఎప్పుడు ప్రతి ఒక ఆటగాడిగా స్ఫూర్తిదాయకం. ఆటగాడిగా ఒక వ్యక్తిగా నన్ను చాలా ప్రభావితం చేశావ్. నువ్వేంటో నాకు తెలుసు  ఆటగాళ్లలో నమ్మకం కలిగేలా చేస్తావ్.. ఐపీఎల్ ట్రోఫీ గెలవడం కంటే అది చాలా ముఖ్యం అంటూ ఎబి డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: