అతి చిన్న వయసులోనే సెంచరీతో రికార్డు?
పూర్తి వివరాల్లోకి వెళితే ఐర్లాండ్ మరియు జింబాబ్వే ల మధ్య జరుగుతున్న వన్ డే సీరీస్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో ఐర్లాండ్ కు చెందిన బ్యాటర్ అమీ హంటర్ అతి చిన్న వయసులోనే సెంచరీ చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. ఆ ఇన్నింగ్స్ లో అత్యధికంగా అమీ హంటర్ 102 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. నిన్న అమీ పుట్టిన రోజు కావడం విశేషం. సరిగ్గా అమీ 016 సంవత్సరాల వయసులోనే ఈ ఘనతను సాధించింది. అంతకు ముందు పురుషుల క్రికెట్ లో ఈ రికార్డు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అయిన షాహీద్ అఫ్రిది పేరిట ఉండేది. మరియు మహిళల క్రికెట్ లో ఇండియన్ క్రికెటర్ మిథాలీ రాజ్ పేరిట ఉండేది.
కానీ ఇప్పుడు ఆ రెండు రికార్డులు తుడిచిపెట్టుకు పోయాయి. ఇప్పుడు ఈమెను సీనియర్ క్రికెటర్లు ప్రశంసిస్తున్నారు. జింబాబ్వే మరియు ఐర్లాండ్ ల మధ్య నాలుగు వన్ డే ల సీరీస్ లో బాగంగా ఐర్లాండ్ ఈ సీరీస్ ను 3-1 తో గెలుచుకుంది. జింబాబ్వే సీరీస్ ఆద్యంతం ఐర్లాండ్ కు గట్టి పోటీ ఇచ్చినా ఐర్లాండ్ జోరు ముందు నిలవలేకపోయింది.