విరాట్ కోహ్లీకి ఇదే చివరి మ్యాచ్ కానుందా?
అందుకే ఇటీవల కోహ్లీ ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకుని తన అభిమానులను ఎంతో నిరాశకు గురిచేశాడు. ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా కోహ్లీ "నేను కెప్టెన్ గా బెంగుళూరు కు ఆడబోయే చివరి సీజన్ ఇదేనని ప్రకటించాడు". బహుశా... ఇది తనకు కెప్టెన్ గా చివరి సీజన్ కాబట్టి జట్టు మొత్తం కూడా ఎంతో పట్టుదలగా మ్యాచ్ మ్యాచ్ కు రాటుదేలుతూ ప్లే ఆప్స్ కు చేరుకుంది. ఈ రోజు మ్యాచ్ లో గెలిచి, మళ్ళీ ఢిల్లీ తో గెలిస్తే ఫైనల్ కు చేరుతుంది. ప్రస్తుతం కేకేఆర్ తో మ్యాచ్ జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ కోహ్లీ అభిమానుల్లో ఒకింత కలవరం మొదలైంది. కోహ్లీకి ఆర్సీబీ కెప్టెన్ గా ఇదే చివరి మ్యాచ్ అవుతుందా అని కంగారు పడుతున్నారు. ఒకవేళ ఈ మ్యాచ్ లో బెంగుళూరు ఓడిపోతే ఒక కెప్టెన్ గానే కాదు, బెంగుళూరు ఆటగాడిగా కూడా ఇదే చివరి మ్యాచ్ అయినా ఆశ్చర్యపడనక్కర్లేదు.
ఎందుకంటే ఈ సీజన్ తర్వాత జనవరిలో మళ్ళీ వేలం జరగనుంది.. ఆ వేలంలో కోహ్లీని బెంగుళూరు యాజమాన్యం అంటిపెట్టుకుంటుందా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే కోహ్లీ ఈ సీజన్ లో పెద్దగా ఫామ్ లో లేడు. కాబట్టి కోహ్లీకి అంత అమౌట్ ఇవ్వడం కన్నా, వేలంలో మరో ఇద్దరు ముగ్గురు మంచి బ్యాట్స్ మాన్ లను తీసుకోవచ్చు. అయితే ఏమి జరగనుందో చూద్దాం.