క్రికెట్ లో సరికొత్త రికార్డు.. అదరగొట్టిన స్మృతి మందాన?

praveen
స్మృతి మందాన.. ఈ పేరు చెబితే చాలు కుర్రకారు మనసు మొత్తం ఊహా ప్రపంచంలో తేలిపోతూ ఉంటుంది.  ఇక ఈ పేరు చెబితే చాలు ప్రేక్షకులందరిలో అంచనాలు కూడా పెరిగి పోతూ ఉంటాయి. ప్రస్తుతం భారత మహిళా క్రికెట్ లో దిగ్గజ క్రికెటర్ గా కొనసాగుతుంది స్మృతి మందాన. ఇక తన ప్రతిభతో ఇప్పటికే ఎంతో మంది క్రికెట్ ప్రేక్షకులను ఆశ్చర్య పరిచిన ఈ మహిళా క్రికెటర్.. తన చిరునవ్వుతో కూడా ఎంతోమంది కుర్రకారు మనసులు కొల్లగొట్టింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఇలా ప్రస్తుతం భారత మహిళా క్రికెట్లో యూత్ అందరికి ఫేవరెట్ క్రికెటర్ గా..  మహిళా క్రికెట్ జట్టుకు కీలక క్రీడాకారిణిగా కొనసాగుతుంది స్మృతి మందాన.



 ఎప్పుడు మైదానంలో పరుగుల వరద పారిస్తూ.. భారీ స్కోర్లు చేసి ఇక ఇండియాకు విజయాన్ని అందించడంలో కీలకపాత్ర వహిస్తూ ఉంటుంది.  తన బ్యాట్తో విజృంభించి ఇప్పటివరకు ఎన్నో రికార్డులను సైతం కొల్లగొట్టింది స్మృతి మందాన. ఇక ఇప్పుడు ఈ క్రికెటర్ మరో చరిత్రకు నాంది పలికింది. ప్రస్తుతం టీమిండియా మహిళల జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్ ఆడుతుంది. ఈ క్రమంలోనే ఇటీవల  స్మృతి మందాన  పింక్ బాల్ టెస్ట్ లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఏకంగా సెంచరీతో విజృంభించింది.



 ఆడిన తొలి పింక్ బాల్ టెస్ట్ లోనే ఏకంగా శతకం బాదింది స్మృతి మందాన. అంతేకాదు ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్ కూడా సంచలన రికార్డును నమోదు చేసింది స్మృతి మందాన. ఇటీవలే టెస్ట్ సిరీస్లో భాగంగా టాస్ ఓడి బ్యాటింగ్కు దిగింది టీమిండియా జట్టు. అయితే తొలి రోజు ఆట నిలిచి పోయే సరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 132 పరుగులతో నిలిచింది. ఇక ఇటీవల భోజన విరామ సమయానికి మూడు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మందాన శతకం సాధించి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: