ఐపీఎల్ హిస్టరీలో.. అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టు ఇదే?

praveen
ఐపీఎల్ వచ్చిందంటే చాలు క్రికెట్ ప్రేక్షకులందరూ టీవీలకు అతుక్కుపోతుంటారు. కన్నార్పకుండా మ్యాచ్ వీక్షిస్తూ ఉంటారు. ఎందుకంటే ఐపీఎల్ లో సింగిల్స్ కాదు మొత్తం సిక్సర్లే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయ్. ఒక్కసారి ఆటగాడు బరిలోకి దిగాడు అంటే సిక్సర్లు ఫోర్లు తో రెచ్చి పోతూ ఉంటాడు.  ఇక ఆటగాళ్ల దూకుడుకు  స్కోర్ బోర్డ్ సైతం భయపడి పరుగులు పెడుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక మైదానంలో ఇంత జరుగుతుంటే అటు చూస్తున్న ప్రేక్షకులు హోరెత్తి పోకుండా  ఎలా ఉంటారు.  అందుకే ఐపీఎల్ వచ్చిందంటే చాలు  క్రికెట్ ప్రేక్షకులందరూ మ్యాచ్ వీక్షించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు.

 అంతేకాదు ఇక ప్రతీ ఐపీఎల్ సీజన్ లో కూడా దాదాపు వందల సంఖ్యలో సిక్సర్లు నమోదు అవుతూ ఉంటాయి.  బిసిసిఐ కూడా ఐపీఎల్ లో ఎన్ని సిక్సర్లు నమోదయ్యాయి. ఏ ఆటగాడు ఎన్ని సిక్సర్లు బాది భారీ స్కోర్లు చేసాడు అన్న విషయాన్ని కూడా అటు ఐపీఎల్ రికార్డుల్లో నమోదు చేస్తూ ఉంటుంది.  అయితే ఇప్పుడు వరకు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టు ఏది అన్న  విషయం మాత్రం చాలామందికి తెలియదు.  అయితే ఐపీఎల్ లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టు ఏదో కాదు  ప్రస్తుతం ఐపీఎల్ లో అత్యధిక టైటిల్స్ గెలిచిన జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్.

 అటు ఐపీఎల్ టైటిల్ ఐదుసార్లు గెలుచుకున్న ఏకైక జట్టుగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ ఇప్పుడు వరకు ఐపీఎల్ మొదలైన 2008 నుంచి 2021 సీజన్ వరకు కూడా ఎక్కువ సిక్సర్లు బాదిన జట్టుగా టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ జట్టు 1318 సిక్సర్లు బాదింది.  ఇక ముంబై ఇండియన్స్ జట్టు తర్వాత 1282 సిక్సర్లతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టు గా రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ జట్టు 1187 సిక్సర్లతో మూడవ స్థానంలో ఉంది. ఇక మూడు సార్లు టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 1174 సిక్సర్లతో 4వ స్థానంలో కొనసాగుతోంది.  ఆ తర్వాత 1111 సిక్సర్లతో కోల్కతా నైట్రైడర్స్ జట్టు ఐదో స్థానంలో ఉంది. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్  1039..  రాజస్థాన్ రాయల్స్ 888.. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 696 సిక్సర్లతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: