భారత బౌలర్లతో అంత ఈజీ కాదు : స్టార్ క్రికెటర్

praveen
టీమ్ ఇండియా బౌలింగ్ విభాగం రోజురోజుకు ఎంతో పటిష్టంగా మారిపోతుంది.  ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం టీమిండియా బౌలింగ్ విభాగం ప్రత్యర్థి జట్లకు వణుకుపుట్టించే విధంగానే ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఇక భారత బౌలర్లు ఎప్పుడూ వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ పై విరుచుకుపడుతున్నారు. టీమిండియానీ విజయం వైపు తీసుకెళ్లేందుకు ఎప్పుడూ శాయశక్తులా కృషి చేస్తూనే ఉన్నారు.

 అయితే ప్రస్తుతం ఎంతో పదునైన యార్కర్ లు విసురుతూ టీమిండియాలో కీలక బౌలర్ గా మారిపోయాడు జస్ప్రిత్ బూమ్రా.  ప్రస్తుతం టీమిండియాను ఆపదలో ఆదుకునే వీరుడిగా.. డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా జస్ప్రిత్ బూమ్రా కొనసాగుతున్నాడు.  మరోవైపు భువనేశ్వర్ కుమార్ తనదైన స్వింగ్ బౌలింగ్ తో కీలక సమయంలో వికెట్లు పడగొడుతూ ఉంటాడు. ఇక మహమ్మద్ షమీ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ సమయంలో ఎలాంటి బంతులు సందిస్తూ వికెట్లు పడగొడతాడో ఊహకందని విధంగా ఉంటుంది.  ఇక ఇటీవల కాలంలో అటు యువ ఆటగాడు మహమ్మద్ సిరాజ్ కూడా అద్భుతమైన బౌలింగ్ తో కీలక సమయంలో వికెట్లు పడగొట్టాడు.

 మరోవైపు అటు స్పిన్ విభాగం కూడా ఎంతో పటిష్టంగానే ఉంది. ఇలా టీమిండియా బౌలింగ్ విభాగాన్ని ఎదుర్కోవడం ప్రత్యర్థికి సవాలుగానే మారిపోతుంది అని చెప్పాలి. ఇక ఇటీవల ఇదే విషయాన్ని చెప్పుకొచ్చాడు ఇంగ్లాండ్ క్రికెటర్ డేవిడ్ మలన్. భారత బౌలర్లు అంతా ఎంతో కఠినమైన వారు అంటూ చెప్పుకొచ్చాడు. టీమ్ ఇండియా బౌలింగ్ కు అలవాటు పడటం దాదాపుగా అసాధ్యం అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఒక్కొక్క బౌలర్ ఒక్కో పాయింట్ లో బంతిని విసురుతారు అని డిఫరెంట్ బాల్స్ రిలీజ్ చేస్తారు అంటూ చెప్పుకొచ్చారు.. అందుకే భారత బ్యాట్స్మెన్ లను ఎదుర్కోవడం  ఒక సవాల్ లాంటిదే అంటూ తెలిపాడు.. భారత బౌలర్లకు అలవాటుపడడం ఎప్పటికీ కష్టమే..  ఇంగ్లాండ్ సిరీస్ లో కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు అంటూ డేవిడ్ మలన్ ప్రశంసలు కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: