ఐపీఎల్ ఫేస్ 2 : రోహిత్ గురించి ఆ వార్తలు అవాస్తవం?

praveen
ప్రతి ఏడాది బిసిసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ జట్టు ఎంత దిగ్గజ జట్టుగా కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు  ఇప్పటివరకు అసలు ఏ జట్టు కు సాధ్యం కాని విధంగా ఏకంగా ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలిచింది ముంబై ఇండియన్స్ జట్టు. టీం ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్గా ఎంతో విజయవంతంగా జట్టును ముందుకు తీసుకు వెళుతున్నాడు. ఆటగాళ్లు అందరినీ సమన్వయం చేయడంలో విజయవంతం అవుతున్నాడు. ఈ క్రమంలోని ప్రస్తుతం ఐపీఎల్ లో ఎంతో పటిష్టమైన జట్టు గా కూడా ముంబై ఇండియన్స్ జట్టు కొనసాగుతోంది.

 ఇకపోతే గత కొన్ని రోజుల నుంచి ఫాన్స్ అందరినీ ఆందోళన కలిగించే ఒక వార్త వైరల్ గా మారిపోయింది. ఇటీవల టీమిండియా కోచింగ్ విభాగం వరుసగా కరోనా వైరస్ బారిన పడటం సంచలనంగా మారిపోయింది. అయితే  అటు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా కోచ్ లతో సన్నిహితంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇక రోహిత్ శర్మ ఐపీఎల్ లో ఆడడం కష్టమే అంటూ ఎన్నో వార్తలు హల్ చల్ చేశాయి  దీంతో అభిమానులు ఆందోళనలో మునిగి పోయారు. కానీ ఇటీవలే ఏకంగా అభిమానులకు కిక్ ఇచ్చే వార్తను అటు ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం వెల్లడించింది.

 ఇటీవలే ముంబై ఇండియన్స్ జట్టు ఫ్రాంచైజీ ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన చార్టెడ్  ఫ్లైట్ లో కెప్టెన్ రోహిత్ శర్మ తోపాటు బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ కూడా ఫ్యామిలీ తో సహా చేరుకున్నట్లు యూఏఈ  తెలుస్తోంది. దీంతో ఇక రోహిత్ శర్మ వచ్చేసాడు అంటూ అభిమానులు అందరూ మురిసిపోతున్నారు. కాగా ఇక కరోనా నిబంధనల ప్రకారం వీరు ఆరు రోజుల పాటు క్వారంటైన్ లో ఉండనున్నారు. ఇక సెప్టెంబర్ 19 వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం కాబోతుండగా ముంబై ఇండియన్స్ జట్టు మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఆడబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: