రోహిత్ -కోహ్లీ ఓపెనింగ్.. నా ఫేవరెట్ జట్టు ఇదే : సన్నీ

praveen
ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో కీలకమైన ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ.  ఇక వీరిద్దరూ జట్టులో ఉన్నారు అంటే చాలు టీమిండియా ఎంతో బలంగా కనిపిస్తుంది. అంతే కాదు ప్రత్యర్థి జట్లు సైతం వీరిద్దరు జట్టులో ఉంటే వణికి పోతూ ఉంటాయ్. అయితే ఎన్నో ఏళ్ల నుంచి అటు టీమిండియాలో స్టార్ ఓపెనర్లుగా కొనసాగుతున్నాడు రోహిత్ శర్మ. విరాట్ కోహ్లీ మూడవ స్థానంలో బరిలోకి బ్యాటింగ్ కి దిగుతూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇద్దరూ మార్చ్ స్వరూపాన్ని మార్చే ఆటగాళ్లే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ఇకపోతే ఒకానొక సమయంలో విరాట్ కోహ్లీ ఏకంగా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్గా బరిలోకి దిగి భారీ పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక అప్పటినుంచి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ టీమిండియా ఓపెనర్లు గా ఉంటేనే బాగుంటుంది అని అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఓపెనింగ్ జోడి ఎప్పుడూ భారీ స్కోర్లు చేయగలుగుతుంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మాజీ క్రికెటర్లు. ఇక ఇటీవల జరిగిన ఇంగ్లాండ్ టెస్ట్ లో కూడా..  రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తే బాగుంటుందని ఎంతో మంది మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయం వ్యక్తం చేశారు.

 ఇక ఇటీవల ఇదే విషయాన్ని మరోసారి భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.  మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లను టీమిండియా ఓపెనర్లు గా పంపితే బాగుంటుంది అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు సునీల్ గవాస్కర్. ఇక ఈ ఫిబ్రవరి లో ఇంగ్లాండ్ తో టీ20 లో కూడా రోహిత్ శర్మ కోహ్లీ ఓపెనింగ్ జోడి అదరగొట్టారు అని..  అందుకే వారిని వరల్డ్ కప్ లో కూడా ఓపెనింగ్ జోడీగా ప్రయత్నిస్తే బాగుంటుంది అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు టి20 వరల్డ్ కప్ కోసం 15 మందితో కూడిన తన ఫేవరెట్ జట్టును కూడా ప్రకటించాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. రోహిత్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్, కె.ఎల్.రాహుల్,రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, బూమ్రా, షమి,భువనేశ్వర్, శార్దూల్ ఠాగూర్, దీపక్ చాహర్, చాహల్ లను టి20 వరల్డ్ కప్ కోసం తన ఫేవరేట్ గా జట్టుగా ఎంపిక చేసాడు సునీల్ గవాస్కర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: