కోహ్లీ, రవిశాస్త్రి పై బీసీసీఐ ఆగ్రహం.. ఎందుకో తెలుసా?

praveen
ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ఎంతో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ బీసీసీఐ  ఆటగాళ్లు అందరినీ కూడా క్వారంటైన్ లో ఉంచుతు వరసగా మ్యాచులు నిర్వహిస్తుంది.  అయితే అటు బిసిసిఐ ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసినప్పటికీ కరోనా వైరస్ మాత్రం భారత క్రికెట్ బోర్డుకు వరుసగా షాకుల ఇస్తూనే ఉంది అన్న విషయం తెలిసిందే.  ఇప్పటికే బిసిసిఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఐపీఎల్ కరోనా వైరస్ కారణంగా నిరవధికంగా వాయిదా పడింది. ఇక ఆ తర్వాత శ్రీలంక పర్యటనకు బయలుదేరిన టీమిండియా జట్టులో కూడా కరోనా వైరస్ కలకలం సృష్టించింది.

 ఇక ఇటీవల ఇంగ్లాండు టూర్ లో ఉన్న టీమిండియా టెస్టు జట్టులో కూడా కరోనా వైరస్ వెలుగులోకి రావడం సంచలనం గా మారిపోయింది. ఏకంగా ప్రధాన కోచ్గా ఉన్న రవిశాస్త్రి సహా మరికొంత మందికి కూడా కరోనా వైరస్ పాజిటివ్ రావడం హాట్ టాపిక్ గా మారిపోయింది.  ఇలా అటు కరోనా వైరస్ బిసిసిఐ ప్లాన్ లకు గండి కొడుతూనే ఉంది.  ఇక ఇటీవల రావిశాస్త్రికి కరోనా వైరస్ ఎలా వచ్చింది అనే దానిపై అటు బిసిసిఐ తీవ్రంగానే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.  ఈ క్రమంలోనే ఇటీవలే రవిశాస్త్రి ఏకంగా ఒక కార్యక్రమానికి వెళ్లడమే దీనికి కారణం అన్న విషయం బయటపడింది. అయితే ఇక రవిశాస్త్రి ఇటీవలే హాజరైన కార్యక్రమానికి జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా హాజరు కావడం గమనార్హం.

 దీంతో అటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ రావిశాస్త్రి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది బీసీసీఐ. ఇప్పటికే జట్టులోని కోచ్ రావిశాస్త్రి, భరత్ అరుణ్, శ్రీధర్ కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. అయితే వీరితో పాటు కోహ్లీ కూడా ఒక బుక్ లాంచ్ కార్యక్రమానికి వెళ్లాడని ఇటీవలే తేలింది. ఇక ఈ బుక్ లాంచ్ కార్యక్రమానికి వెళ్లిన తర్వాతనే టీమిండియా ముగ్గురు కోచ్ లు కూడా కరోనా వ్యాధి సోకిందని బిసిసిఐ భావిస్తోంది. అయితే ఈ బుక్ లాంచ్ కార్యక్రమానికి వెళ్లడానికి కనీసం ఒక్కరు కూడా బిసిసిఐ దగ్గర ముందస్తు అనుమతి తీసుకోకపోవడంపై బిసిసిఐ అధికారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: