కోహ్లీతో పెట్టుకుంటే.. లండన్ వీధుల్లో విప్పుకు తిరుగుతాడు : గంగూలీ

praveen
కెప్టెన్ అంటే ఇలాగే ఉండాలి అనే నానుడికి స్వస్తి పలుకుతూ తనదైన శైలిలో కెప్టెన్సీ చేసి టీమిండియాకు ఎన్నో మరపురాని విజయాలు అందించాడు సౌరవ్ గంగూలి. ఏకంగా అప్పట్లో ఎంతో దూకుడుగా వ్యవహరిస్తూ బెంగాల్ టైగర్ గా పేరు తెచ్చుకున్నాడు.  ఏ బావోద్వేగాన్ని  కూడా  అటు లోపల దాచుకోకుండా పైకి చూపిస్తూ ఉండేవాడు సౌరవ్ గంగూలీ. ఇక అటు మైదానంలో ఎంతో దూకుడుగా  ఉండేవాడు. ఇక సౌరవ్ గంగూలీ దూకుడైన ఆటకు దూకుడైన కెప్టెన్సీకి అటు భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు అచ్చంగా సౌరవ్ గంగూలీ తరహాలోనే విరాట్ కోహ్లీ కూడా ఎంతో దూకుడైన కెప్టెన్ అనే చెప్పాలి.



 ఒకవేళ మైదానంలో ఆటగాళ్లు ఏదైనా తప్పు చేస్తే ఎలా కోప్పడతాడో అలాగే ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తే ప్రశంసలతో ముంచెత్తుతాడు. అంతేకాదు ప్రత్యర్థి జట్టు ఏదైనా సవాల్ విసిరింది అంటే ఆ సవాలును స్వీకరించి అంతకుమించి అనే రేంజ్ లోనే చేసి చూపిస్తాడు విరాట్ కోహ్లీ.  ఇకపోతే సౌరవ్ గంగూలీ ఇటీవల విరాట్ కోహ్లీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్టింగ్ లో వస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి అనే కార్యక్రమానికి ఇటీవలే సౌరబ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ స్పెషల్ గెస్ట్ గా వెళ్లారు.



 ఈ క్రమంలోనే అమితాబచ్చన్ అటు సౌరవ్ గంగూలీ ఒక ప్రశ్న  అడుగగా ఆసక్తికర సమాధానం చెప్పాడు సౌరబ్ గంగూలీ. ఒకప్పుడు ఇంగ్లండ్ గడ్డపై విజయం సాధించిన సమయంలో మీరు షర్ట్ విప్పి సెలబ్రేషన్ చేసుకున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఆడుతున్న టీమిండియా విజయం సాధిస్తే కెప్టెన్ విరాట్ కోహ్లీనీ కూడా షర్ట్ విప్పేసి సెలబ్రేట్ చేసుకో మంటారా  అంటూ అమితాబచ్చన్ అడగగా..  ఆరోజు నేను చేసిన దానికి ఇప్పటికి సిగ్గు అనిపిస్తూ ఉంటుంది. అయితే కోహ్లీకి అలాంటి చాలెంజ్ విసిరలేను  ఎందుకంటే నేను స్టేడియంలో షర్ట్ విప్పగలవా  అని అడిగితే లండన్ వీధుల్లో కూడా విప్పేసి తిరుగుతాడు కోహ్లీ. ఎందుకంటే ఛాలెంజ్  అంత సీరియస్గా తీసుకుంటాడు అంటూ సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: