హార్దిక్ పాండ్యా చేతికి వాచ్.. ధర తెలిస్తే షాకే?
అయితే ఇలా క్రికెట్ సెలెబ్రిటీ లలో ఎక్కువగా ఎప్పటికప్పుడు కొత్తగా దుస్తులను ధరించడం లేదా కొత్త కొత్త వాచ్లు ధరించడం లాంటివి చేసేవారిలో అటు హార్దిక్ పాండ్యా ఎప్పుడూ ముందుంటాడూ. ఇటీవలే శ్రీలంక పర్యటనకు వెళ్లి వచ్చిన హార్దిక్ పాండ్యా ప్రస్తుతం రెండవ దశ ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల యూఏఈ చేరుకున్నాడూ. అయితే ఇక ఇటీవలే హార్థిక్ పాండ్యాకు యూఏఈలో ఒక వాచ్ తెగ నచ్చేసింది. ఇక ఆ వాచ్ ఖరీదు ఎంత అనే విషయాన్ని కూడా లెక్క చేయకుండా ఏకంగా ఆ వాచ్ కొనుగోలు చేశాడూ హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా చేతికి వాచ్ కొత్తగా కనిపించడంతో దాని గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు అందరూ.
ఈ క్రమం లోనే హార్థిక్ పాండ్యా ధరించిన వాచ్ గురించి తెలుసుకుని అందరూ అవాక్కవుతున్నారు. దీంతో ప్రస్తుతం హార్దిక్ పాండ్యా పెట్టుకున్న వాచ్ టాక్ ఆఫ్ ద సోషల్ మీడియా గా మారి పోయింది. ఇంతకీ హార్థిక్ వాచ్ విలువ ఎంతో తెలుసుకోవడానికి మీరు కూడా బాగా ఆతృతగా ఉన్నారు కదా. ఇటీవల యూఏఈ వేదిక హార్దిక్ పాండ్యా కొనుగోలు చేసిన వాచ్ ధర ఏకంగా అక్షరాల ఐదు కోట్ల రూపాయలు. పచ్చటి వజ్రాలతో పొదిగిన వాచ్ తెగ నచ్చేయడం తో ఇక అంత ధర పెట్టి కొనడానికి కూడా హార్థిక్ పడే వెనకాడలేదట.