టి20 వరల్డ్ కప్ ముందు.. కోహ్లీ రహస్య సమావేశం?
అయితే మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ అటు బిసిసిఐకి మాత్రమే కాదు మరో వైపు విరాట్ కోహ్లీకి కూడా ఎంతో కీలకంగా మారనుంది. కోహ్లీ కెప్టెన్సీలో ఇప్పటికే టీమిండియా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే ప్రపంచకప్, 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ కోల్పోయింది. ఈ క్రమంలోనే ఇక రానున్న రోజుల్లో ఐసీసీ ట్రోఫీ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది కోహ్లీకి. లేదంటే ఇక విరాట్ కోహ్లీ కెప్టెన్సికే ఎసరు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ పెద్దలు అటు విరాట్ కోహ్లీతో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.
అయితే ఈ సమావేశానికి సంబంధించి ఎలాంటి సమాచారం మాత్రం బయటకు రాకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఐపీఎల్ తర్వాత ఇక జరగబోయేది టి20 వరల్డ్ కప్ కాబట్టి ఇక ఈ మెగా టోర్నీ కోసం టీమిండియా జట్టును ఎంపిక చేయడం విషయంలో కూడా విరాట్ కోహ్లీతో చర్చలు జరిపారట. ఈ క్రమంలోనే ప్రస్తుతం టి20 వరల్డ్ కప్ జట్టులో ఎవరికి స్థానం దక్కబోతోంది అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇక ప్రస్తుతం ఏ ఆటగాడు ఎలా రాణిస్తున్నాడు ఎలాంటి ప్రతిభ కనబరుస్తున్నాడూ అనే విషయంపై కూడా బీసీసీఐ విశ్లేషణలు ప్రారంభించిందట.