ఒలింపిక్స్ బరిలో వరల్డ్ నెం.1 !
టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్ పై క్రీడాభిమానులు చాలా ఆశలే పెట్టుకున్నారు. ఆయనలో పోరాట పటిమ చాలా ఉందనీ.. ఖచ్చితంగా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధిస్తాడని అంటున్నారు. ఇప్పుడు అలాంటి అభిమానుల కోసమే తన మనసు మార్చుకున్నాడు. మొన్నటి దాకా నో చెప్పిన ఈ ఆటగాడు ఇప్పుడు ఓకే చెబుతున్నాడు. దీంతో క్రీడాభిమానుల్లో ఆనందం కట్టలు తెంచుకుంటోంది.
టెన్నిస్ విభాగంలో.. ఒకే ఏడాది నాలుగు గ్రాండ్ స్లామ్ లు, ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాాధిస్తే గోల్డెన్ స్లామ్ గా భావిస్తారు. ఈ అద్భుత అవకాశం కేవలం జకోవిచ్ కే ఉంది. ఇక ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్ లో ఆడతానని జకోవిచ్ చెబుతుండటంతో స్పోర్ట్స్ ఫ్యాన్స్ కేరింతలు కొడుతున్నారు. జకోవిచ్ పేరు చరిత్రలో నిలిచిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటో టోక్యో ఒలింపిక్స్ లో కరోనా ఆంక్షలు కొనసాగుతున్నాయి. క్రీడాభిమానులను స్టేడియంలోకి అనుమతించడం లేదు. ఎందుకంటే అక్కడ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక లక్షలాది ప్రేక్షకులు అక్కడికి వస్తే కేసులు మరింత పెరగవచ్చనే అభిప్రాయం జపాన్ ప్రభుత్వం ఉంది. అందుకే అక్కడ కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. మరోవైపు థర్డ్ వేవ్ కూడా ఆ దేశ ప్రజలను భయపెడుతోంది. మరోవైపు ఒలింపిక్స్ బరి నుండి తాను తప్పుకుంటున్నట్టు స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ స్పష్టం చేశాడు. తన మోకాలికి గాయం కారణంగానే తాను ఈ డెసిజన్ తీసుకుంటున్నట్టు వెల్లడించాడు.