ఇప్పుడు నా టార్గెట్ అదే.. ధావన్ కామెంట్స్?

praveen
ఇటీవలే భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. పూర్తిగా యువ ఆటగాళ్లతో కూడిన జట్టు ప్రస్తుతం శ్రీలంకతో వన్డే, టి20 సిరీస్ ఆడబోతుంది. ఈ క్రమంలోనే  ఇక భారత జట్టు శ్రీలంక పర్యటన లో ఎలా రాణించ పోతుంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. భారత జట్టు మొదటిసారి రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కాకుండా శిఖర్ ధావన్ కెప్టెన్సీలో శ్రీలంక పర్యటనకు బయలుదేరి వెళ్లింది.  ఇక ఈ జట్టుకు కోచ్గా రాహుల్ ద్రవిడ్ వ్యవహరిస్తున్నాడు.  అయితే ఎన్ని రోజుల వరకు జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న శిఖర్ ధావన్ ఇక ఇప్పుడు కెప్టెన్గా ఎలా జట్టును ముందుకు నడిపించ పోతున్నాడు అన్నదానిపై కూడా అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి


 ఇకపోతే జూలై 13వ తేదీన ప్రారంభం కావాల్సిన సీరిస్ కరోనా వైరస్ కారణంగా జూలై 18 నుండి ప్రారంబం కాబోతుంది. అయితే ఇక సిరీస్కు ముందు భారత కెప్టెన్ శిఖర్ ధావన్ ఇటీవల మీడియాతో మాట్లాడారు. ఇక శ్రీలంక పర్యటనలో యువ క్రికెటర్లకు తమ సత్తా నిరూపించుకునేందుకు ఇది గొప్ప అవకాశం అంటూ శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు. ఇక భారత జట్టుకి సారథిగా ఎంపిక కావడాన్ని ఎంతో గొప్ప అచీవ్మెంట్ గా భావిస్తున్నాను అంటూ శిఖర్ ధావన్ తెలిపారు.



 ఒక కెప్టెన్గా లీడర్ గా నాది ఒకటే టార్గెట్.. జట్టును ముందుండి నడిపించి ఆటగాళ్ళందరిని కూడా సంతోషంగా ఉంచాలి అని అనుకుంటున్నాను అంటూ శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు  టీం లో ఎంతో సరదాగా ఉండే కుర్రాళ్ళు ఉన్నారు. అంతే కాదు అద్భుతమైన మద్దతు ఇచ్చే కోచింగ్ స్టాఫ్ కూడా ఉన్నారు  ప్రస్తుతం హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తో తనకు ఎంతో మంచి అనుబంధం కూడా ఉంది  గతంలో తాను భారత ఏ జట్టు కి ఆడినప్పుడు కూడా రాహుల్ ద్రావిడ్ కోచ్గా వ్యవహరించారు అంటూ శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు.కాగా శ్రీలంక టీమిండియా మధ్య జూలై 18 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: