ధోని కోసం ఏమైనా చేస్తాం.. మహి ది బెస్ట్ కెప్టెన్ : కేఎల్ రాహుల్
ధోనీ మైదానంలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మ్యాచ్ గెలిచి తీరుతాము అంటూ భావిస్తూ ఉంటారు ప్రేక్షకులు. అయితే వికెట్ల వెనకాల ఉండి మ్యాచ్ స్వరూపాన్ని ఎప్పటికప్పుడు మార్చడంలో ధోని కి ఎవరు సాటి లేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎంత ఒత్తిడిలో అయినా సరే చిరునవ్వుతోనే ఉంటూ అందరి మనసులు గెలిచాడు మహేంద్ర సింగ్ ధోనీ. దీంతో అభిమానులే కాదు సహచర ఆటగాళ్లు కూడా మహేంద్రసింగ్ ధోని అమితంగా అభిమానిస్తూ ఉంటారు. ఇకపోతే ఇటీవలే టీం ఇండియా ప్లేయర్ కె.ఎల్.రాహుల్ ధోనీ కెప్టెన్సీ గురించి ఆసక్తికర చేసాడు.
ఇటీవలే ఫోర్స్బ్ ఇండియా చిట్ చాట్ లో కె.ఎల్.రాహుల్ మాట్లాడాడు. అయితే ధోని కోసం తాము ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాం అంటూ కె.ఎల్.రాహుల్ చెప్పుకొచ్చాడు. కెప్టెన్ అనే మాట వింటే చాలు తమ తరం వారిలో ఎవరికైనా సరే ధోని పేరే గుర్తొస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు ఈ యువ ఆటగాడు. టీం సభ్యులందరిలో ఇంత గౌరవాన్ని దక్కించుకోవడం ఎంతో గొప్ప విషయం అంటూ కె.ఎల్.రాహుల్ చెప్పుకొచ్చాడు. ధోనీ ది బెస్ట్ కెప్టెన్ అంటూ తెలిపాడు కె.ఎల్.రాహుల్. ఇకపోతే ప్రస్తుతం మహేంద్ర సింగ్ ధోనీ తన అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.ప్రస్తుతం కేవలం దేశవాళీ క్రికెట్లో మాత్రమే ఆడుతున్నాడు మహేంద్రసింగ్ ధోని.