ముదురుతున్న వర్గపోరు.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు కొత్త అధ్యక్షుడు?

praveen
కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ఉన్న వివాదాలు బహిర్గతమై సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా  హైదరాబాద్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ను తొలగిస్తూ ఇటీవలే అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారిపోయింది. అయితే కౌన్సిల్ నిర్ణయంపై అటు అధ్యక్షుడు అజారుద్దీన్ తీవ్రస్థాయిలో మండిపడుతు వ్యాఖ్యలు చేశారు.  అధ్యక్ష పదవి లోనే కొత్త జిల్లాల కు సంబంధించిన వారికి హైదరాబాద్ క్రికెట్ కౌన్సిల్ లో సబ్యత్వం కల్పిస్తూ ఇటీవల అజారుద్దీన్  నిర్ణయం తీసుకున్నారు.



 ఇలా  తనను అధ్యక్ష పదవి నుంచి తొలగించామని చెప్పినప్పటికీ ఆయన మాత్రం చేయాల్సిన పని చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో రోజురోజుకు వర్గపోరు ముదురుతోంది   ఇటీవలే హైదరాబాద్ క్రికెట్ కౌన్సిల్ తాత్కాలిక ప్రెసిడెంట్గా జాన్ మనోజ్ ను నియమిస్తున్నట్లు కౌన్సిల్ లేఖను విడుదల చేసింది. అయితే ఇటీవలే హైదరాబాద్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు అజారుద్దీన్ సభ్యత్వం రద్దు చేయడంతోపాటు అధ్యక్ష పదవి నుండి తొలగిస్తున్నట్లు అపెక్స్ కౌన్సిల్ తెలిపింది. ఇక షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది



 ఇక ఇప్పుడు ఏకంగా తాత్కాలిక ప్రెసిడెంట్గా జాన్ మనోజ్ నియమిస్తున్నట్లు అపెక్స్ కౌన్సిల్ ప్రకటించడం సంచలనంగా మారింది. దీంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో పరిస్థితి చూస్తుంటే ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా మారింది పరిస్థితి అని అంటున్నాడు క్రికెట్ విశ్లేషకులు. మరికొన్ని రోజుల్లో క్రికెట్ సీజన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇక ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ కౌన్సిల్ లో ఉన్న వర్గ పోరు ప్రభావం ప్లేయర్స్ పై పడే అవకాశం ఉంది అని అటు ఆటగాళ్లు కూడా ఆందోళనలో మునిగిపోయారు.  అయితే ఇటీవలే హైదరాబాద్ క్రికెట్ కౌన్సిల్ కు తాత్కాలిక  ప్రెసిడెంట్ ని అపెక్స్ కౌన్సిల్ నియమించిన నేపథ్యంలో దీనిపై అజారుద్దీన్ ఎలా స్పందిస్తారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Hca

సంబంధిత వార్తలు: