WTC FINAl : టీమిండియా అలా చేస్తే బెటర్.. గంగూలీ సూచన?

praveen
వారెవ్వా క్రికెట్ మ్యాచ్ అంటే ఉత్కంఠ ఇలాగే ఉండాలేమో.. ఇంకా మ్యాచ్ ప్రారంభం కానే లేదు.. అప్పుడే క్రికెట్ ప్రేక్షకుల్లో టెన్షన్ మొదలైంది.  ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో ఎవరు విజయం సాధించ బోతున్నారు అన్నదానిపై.. ఎవరికివారు అంచనాల పెంచేసుకుంటున్నారు.  ఇక మ్యాచ్ మొదలవడానికి కొన్ని గంటల ముందే టీవీలకు అతుక్కు పోవడానికి సిద్ధమయ్యారు క్రికెట్ ప్రేక్షకులు. ఇక మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎదురుచూస్తున్న వరల్డ్ ఛాంపియన్ ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది.

 ఇప్పటికే టీమ్ ఇండియా న్యూజిలాండ్ జట్లు ఫైనల్ మ్యాచ్లో తలబడేందుకు తమదైన వ్యూహాలతో సిద్ధం అయ్యాయి. ఒకవైపు అగ్రెసివ్ కెప్టెన్ కోహ్లీ మరోవైపు మిస్టర్ కూల్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇద్దరు కూడా తమ వ్యూహాలకు పదును పెడుతూ జట్టుకు విజయం అందించేందుకు  సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఇక ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ లో ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని పై మాజీ ఆటగాళ్లు ఎన్నో సూచనలు సలహాలు ఇస్తున్నారు. ఇటీవలే బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కోహ్లీ సేన కు ఒక సూచన చేశాడు.

 ఒక వేళ రెండు టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచు కోవాలి అంటూ సూచించాడు.  ఎందుకంటే విదేశాల్లో ఆడిన సమయం లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సమయంలో విజయం సాధించింది అంటూ చెప్పుకొచ్చాడు.2002, 2018 సౌతాఫ్రికాతో బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా విజయం సాధించింది. కాస్త ఒత్తిడి ఎదుర్కొన్నప్పటికీ చివరికి గెలిచింది.  అందుకే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచు కోవడం బెటర్ అంటూ సూచించాడు.  టీమిండియా గెలుస్తుంది అన్న నమ్మకం ఉంది. కానీ న్యూజిలాండ్ జట్టును అంత తక్కువగా అంచనా వేయకూడదు అంటూ సౌరవ్ గంగూలీ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: