మన భారతీయ ఆటగాళ్లు ఎంతవరకూ చదువుకున్నారో తెలుసా..?

Divya

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో  హీరో హీరోయిన్లు ఎంత వరకూ చదువుకున్నారు అన్న విషయం గురించి చాలా మందికి తెలుసు. కానీ మన భారత్ దేశం తరఫున ఆడే క్రికెట్ ప్లేయర్ లు చాలామంది ఉన్నారు. వారికి క్రికెట్ మీద అభిమానం వల్ల కొంతమంది ఎక్కువ చదువులు చదవలేక పోయారు.. ప్రస్తుతం మన ప్రేయర్లు ఎంత మంది ఎంతవరకు చదువుకున్నారో మనం తెలుసుకుందాం.
1) మహేంద్రసింగ్ ధోని:

క్రికెట్ చూసేవాళ్ళకి మహేంద్రసింగ్ ధోని అంటే పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. ఎందుకంటే స్టేడియంలో  అతని పేరు అంతలా మార్మోగిపోతోంది. అయితే ధోనీ B.com డిగ్రీ చదివారు.
2). సచిన్-టెండూల్కర్:
16 సంవత్సరాల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టారు.దీంతో ఈయన 10+2 మాత్రమే చదివారు.
3). యువరాజ్ సింగ్:
వరల్డ్ కప్ లో అత్యంత కీలక పాత్ర పోషించిన యువరాజ్ సింగ్ కూడా 10+2 చదివారు.
4). రాహుల్ ద్రావిడ్:
ఇండియన్ టీంలో వికెట్ కి, బంతికి మధ్య నిలబడగలిగే ఏకైక వ్యక్తి రాహుల్ ద్రావిడ్ అని చెప్పుకోవచ్చు. అంతలా పేరుపొందాడు ఈయన. భారతీయ జట్టు సభ్యులలో అత్యధికంగా చదివిన వ్యక్తి రాహుల్ ద్రావిడ్ ఈయన ఎంబీఏ పూర్తి చేశాడు.

5). వివిఎస్ లక్ష్మణ్:
క్రికెట్ మీద ఎక్కువ మక్కువతో MBBS మధ్యలోనే ఆపేశాడు.

6). సౌరవ్ గంగూలీ:
జట్టులోని ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి టీమిండియాకు ఎన్నో అద్భుత విజయాలు అందించిన వ్యక్తి సౌరవ్ గంగూలీ.ఈయన కూడా డిగ్రీ వరకు చదివారు.
7) వీరేంద్ర సెహ్వాగ్:
క్రికెటర్లలో బౌలర్లను కూడా భయపెట్టవచ్చని, తన బ్యాటింగ్ తో సమాధానం చెప్పిన వక్తి వీరేంద్ర సెవాగ్.ఈయన కూడా డిగ్రీ వరకు చదివారు.
8). గౌతమ్ గంభీర్:
ఇండియా టీం తరుపున కష్టమైన పరిస్థితిలో వికెట్లు కోల్పోకుండా నిలబడి , టీమిండియాను గెలిపించడంలో ఈయనకే సాటి.ఈయన కూడా డిగ్రీ వరకు చదివారు.
9) విరాట్ కోహ్లీ:
విరాట్ కోహ్లీ 2008లో టీమిండియాలోకి ప్రవేశించాడు. ఈయనను భారత్ జట్టుకు అత్యంత కీలకమైన క్రికెటర్ గా చెప్పవచ్చు. ఈయన కూడా 10+2 వరకు చదివాడు.

10). రోహిత్ శర్మ:
ఇండియన్ టీం లో అత్యంత ప్రమాదకరమైన బ్యాట్ మెన్ గా చెప్పవచ్చు. ఈయన కూడా 10+2 మాత్రమే చదివారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: