కోహ్లీ అందుకే తడబడుతున్నాడేమో?
ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఒకసారి మైదానంలోకి వచ్చాడు అంటే పరుగుల వరద పారిస్తూ ఉంటాడు. ఇక కోహ్లీ బ్యాటింగ్ చేస్తుంటే ఎదురుగా ఉన్నది ఎంతటి దిగ్గజ బౌలర్ అయిన వెన్నులో వణుకు పుడుతుంది. విరాట్ కోహ్లీ ఇక ఎప్పుడు పరుగుల వరద పారిస్తూ స్కోరుబోర్డును ఉరకలెత్తిస్తూ ఉంటాడు. అయితే ఎంత దిగ్గజ బ్యాట్స్మెన్ అయినా సరే కొన్ని కొన్ని సార్లు తడబడుతూ ఉంటారు. ముఖ్యంగా కొంతమంది బౌలింగ్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక విరాట్ కోహ్లీ తడబాటు పై ఇటీవలే టీం ఇండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్లలో ఒక్కడైన విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ బౌలింగ్ లో మాత్రం తడబడ్డాడు అంటూ వ్యాఖ్యానించాడు ఇర్ఫాన్ పఠాన్.
ప్రస్తుతం ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్ గా కొనసాగుతున్న జేమ్స్ అండర్సన్ బౌలింగ్ లో ఎక్కువగా బంతి స్వింగ్ అవుతూ ఉంటుందని.. ఇలా బంతి స్వింగ్ అవుతున్న సమయంలో విరాట్ కోహ్లీ మాత్రమే కాదు ఏ బ్యాట్స్మెన్ అయినా సరే తడబడటం సర్వసాధారణం అంటూ ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు. అలాగే ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ కూడా జేమ్స్ అండర్సన్ బౌలింగ్ లో స్వింగ్ బంతులు వచ్చిన సమయంలో తడబడుతూ ఉంటాడు అని చెప్పుకొచ్చాడు. అండర్సన్ బౌలింగ్ లో విరాట్ కోహ్లీ ఎప్పుడూ కూడా సౌకర్యంగా బ్యాటింగ్ చేయడం తాను చూడలేదని.. స్వింగ్ అవుతున్న బంతిని అంచనా వేయడం చాలా కష్టం అంటూ ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.