రికార్డుల 'కింగ్' కోహ్లీ.. మరోసారి ఇరగదీశాడు?
అంతలా విరాట్ కోహ్లీ విధ్వంసం సృష్టిస్తాడు. టీమిండియాకు ఎన్నో సార్లు విజయం అందించాడు. ప్రస్తుతం జట్టులో కీలక ఆటగాడిగా జట్టును ముందుకు నడిపించే సారధిగా కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ. అయితే విరాట్ కోహ్లీ ఎంతోమంది దిగ్గజాలు సాధించిన రికార్డులను సైతం అతి తక్కువ సమయంలోనే చేధించి తనకు తిరుగు లేదు అని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో కూడా విరాట్ కోహ్లీ సృష్టించిన రికార్డులు ఇతర ఆటగాళ్లకు అందుకోలేనంత దూరంలో ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎప్పుడూ తన రికార్డులను తానే బ్రేక్ చేస్తూ ఉంటాడు విరాట్ కోహ్లీ.
అందుకే విరాట్ కోహ్లీని రికార్డుల రారాజు అని పిలుస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు మరోసారి అరుదైన రికార్డును సాధించి అదరగొట్టాడు విరాట్ కోహ్లీ. అన్ని రకాల ఐసిసి ఈవెంట్లలో 500కు పైగా పరుగులు చేసిన మొట్టమొదటి ఆటగాడిగా ఘనత సాధించాడు విరాట్ కోహ్లీ. వన్డే వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఇలా అన్నీ ఈవెంట్ లలో కూడా ఇప్పటివరకు ఐదు వందల పరుగులు చేసి రికార్డు సృష్టించాడు ఇక మరికొన్ని రోజుల్లో జరగబోతున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ రాణించ బోతున్నాడు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తీరుపై ప్రస్తుతం అంచనాలు పెరిగిపోతున్నాయి.