WTC ఫైనల్.. మళ్ళీ ఆ ఐరెన్ లెగ్ అంపైర్.. ఇండియన్ ఫ్యాన్స్ లో కలవరం?

praveen
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ మరికొన్ని రోజుల్లో జరగబోతుంది.  వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరిపేందుకు ఇప్పటికే అన్ని సన్నాహాలు పూర్తి అయిపోయాయి. జూన్ 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఈ ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. న్యూజిలాండ్ టీమిండియా మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ పై ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అంచనాలు కూడా ఉన్నాయి.  ఈ క్రమంలోనే ప్రస్తుతం టీమిండియా అభిమానులు అందరూ ఇక ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో కోహ్లీ సేన విజయం సాధిస్తుంది అని ధీమాతో ఉన్నారు. కానీ ఇటీవలే తెలిసిన ఒక విషయం తో మాత్రం నిరాశలో మునిగిపోతున్నారు.



 ప్రస్తుతం ఇంగ్లండ్లో జరుగుతున్న టెస్టు మ్యాచ్ కోసం కరోనా సమయంలో ఇతర దేశాల నుంచి అంపైర్లు  వచ్చే అవకాశం  లేకపోవడంతో న్యూట్రల్ అంపైర్ల ను  ఐసిసి కేటాయిస్తోంది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్కు చెందిన అంపైర్లు  కీలకంగా మారిపోతారు. ఇలాంటి తరుణంలో అటు టీమిండియాకు ఇప్పటివరకు ఒక్క సారి కూడా కలిసి రాని రిచర్డ్ కెటిట్‌బరో‌ ను ఐసీసీ ఫైనల్ మ్యాచ్ కోసం నియమించే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.



 దీంతో టీమిండియా కి ఐరన్ లెగ్ ఎంపైర్ గా మారిన రిచర్డ్ కెటిట్‌బరో‌ ను ఎంపైర్ గా నియమించి వద్దు అంటూ అటు సోషల్ మీడియా వేదికగా భారత జట్టు అభిమానులతో పాటు మాజీ ఆటగాళ్లు సైతం కోరుతున్నారు. ఇప్పటివరకు టీమ్ ఇండియా ఆడిన సమయంలో రిచర్డ్ కెటిట్‌బరో‌ అంపైరింగ్ చేస్తే ఇక ఆ మ్యాచ్లో టీమిండియా ఓడిపోయింది. ఈ రికార్డ్  దృష్టిలో పెట్టుకుని ఐసీసీ రిచర్డ్ కెటిట్‌బరో‌ ను అంపైర్ గా  నియమించి వద్దు అంటూ కోరుతున్నారు అభిమానులు. కానీ ఇటీవల ఐసీసీ అధికారికంగా ప్రకటించిన అఫీషియల్స్ లో రిచర్డ్ కెటిట్‌బరో‌ కూడా ఎంపికయ్యాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Wtc

సంబంధిత వార్తలు: