స్పోర్ట్స్ : త్వరలో స్పోర్ట్స్ ఛానల్స్ మూసివేత..కారణం ?

Divya

ఇండియా లోనే అతి పెద్ద టీవీ ఛానల్స్ నెట్వర్క్ ఉన్న సంస్థ వాల్ట్ డిస్నీ (the Walt Disney) . ఈ సంస్థకు అనేక ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ తో పాటు క్రీడ ఛానల్స్ కూడా ఉన్నాయి. అయితే గత కొన్ని ఏళ్లుగా కేబుల్ టీవీ లో వచ్చిన మార్పుల కారణంగా కొన్ని టీవీ ఛానల్స్ నష్టాల బాట పడ్డాయి. అంతే కాకుండా వాటిని చూసే వారి సంఖ్య కూడా ప్రతిరోజు తగ్గిపోతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే సౌత్, ఈస్ట్, ఏసియా పరిధిలో దాదాపు 100 ఛానల్స్ ను మూసివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.


ముఖ్యంగా చెప్పాలి అంటే"  రోజురోజుకు ప్రేక్షకుల ఛాయిస్ మారిపోతుంది . టీవీల కంటే ఓటీటీ ప్లాట్ఫాం వైపే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. అదే సమయంలో అనలాగ్ ఛానెల్స్ కంటే హెచ్డీ ఛానల్స్ కే ఆదరణ పెరుగుతోంది. కాబట్టి మా దగ్గర ఉన్న కంటెంట్ ను డిస్నీ ప్లస్ లోకి తరలిస్తున్నామని డిస్నీ సీఈవో బాబ్ చెక్ వెల్లడించారు. 2020లో 30 టీవీ ఛానల్స్ ని బంద్ చేశాము. ఈ ఏడాది సెప్టెంబర్ ఆఖరికి 100 టీవీ ఛానల్స్ ను బంద్ చేయాలని నిర్ణయించుకున్నామని" కూడా ఆయన ఒక మీడియా కాన్ఫరెన్స్ లో తేల్చి చెప్పారు.

ఇకపై కేబుల్ , డీటీహెచ్ ప్లేయర్స్ మధ్యలో లేకుండా డైరెక్ట్ వినియోగదారుల దగ్గరికే వెళ్ళే అవకాశం ఉండడంతో మేమే ఆ బాటలోనే వెళ్లాలి అనుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే డిస్నీ మూసివేయాలి అనుకుంటున్న  ఛానల్స్ లో  బాగా పాపులారిటీ పొందిన స్పోర్ట్స్ ఛానల్స్.. స్టార్ స్పోర్ట్స్ వ,న్ స్టార్ స్పోర్ట్స్ 2, ఫాక్స్ స్పోర్ట్స్ 1, ఫాక్స్ స్పోర్ట్స్ 2 , ఫాక్స్ స్పోర్ట్స్ 3  వంటి అనలాగ్ ఛానల్స్ ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరులోగా వీటిని మూసివేసి, ఆ తరువాత హెచ్డీ ఛానల్స్ మాత్రమే కొనసాగించే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఇండియాలో చాలా ప్రాంతాల్లో ఉండే తక్కువ బ్యాండ్ విడ్త్  ప్రాంతీయ భాషలను  కూడా దృష్టిలో పెట్టుకొని ,తాము ముందుకు వెళ్లేందుకు భావిస్తున్నట్లు బాబ్ వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: